పల్లె ప్రగతి కార్యక్రమం

పల్లె ప్రగతి ద్వారా గ్రామాల సమస్యలన్నీ పరిష్కారం
జిల్లా కలెక్టర్ హరిత

గ్రామీణ ప్రాంతాలలోని మారుమూల పల్లెల్లో నెలకొన్న అన్నిరకాల సమస్యల పరిష్కారానికి పల్లె ప్రగతి కార్యక్రమాలు వేదికలుగా మారాలని జిల్లా కలెక్టర్ హరిత సూచించారు.

పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాయపర్తి మండలం లోని పెర్కవేడు గ్రామంలో జరిగిన గ్రామసభకు కలెక్టర్ హాజరయ్యారు

ఈ సందర్భంగా గ్రామస్తులు విద్యుత్ లైన్ల మార్పు, సీసీ రోడ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని కోరగా పల్లె ప్రగతి కార్యక్రమం లో సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు ఉంటాయని కలెక్టర్
చెప్పారు.

భూ సమస్యలపై ఎవరు అధికారుల చుట్టూ, కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేదని ప్రభుత్వం మీ సేవ కేంద్రం ద్వారా ధరణి వెబ్సైట్ లో తమ దరఖాస్తులను పెట్టుకోవాలని..తద్వారా సమస్యలు తొందరగా పరిష్కారమవుతాయని కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు.

ఎస్సీ కాలనీలో మౌలిక సదుపాయాలకు ప్రభుత్వం నిధులు ఇచ్చిందని కావున గ్రామ పంచాయతీ సిబ్బంది సమస్యలను గుర్తించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.

అనంతరం గ్రామ శివారు లోని పల్లె ప్రకృతి వనం, రైతు వేదిక భవనము, మండలంలోని రాగన్న గూడెం, రాయపర్తి- కొత్త రాయపర్తి చౌరస్తాలో కలెక్టర్, డి ఎఫ్ ఓ అర్పణ, ప్రజా ప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులతో కలిసి మొక్కలు నాటారు

ఈ కార్యక్రమంలో డి ఎఫ్ ఓ అర్పణ, అదనపు కలెక్టర్ హరి సింగ్, ఆర్ డి ఓ మహేందర్ జి, డి ఆర్ డి ఓ సంపత్ రావు, డి పి ఓ ప్రభాకర్, ఏ పీ డీ వసుమతి, ఎంపీపీ అనిమిరెడ్డి, జెడ్ పి టి సి రంగు కుమారస్వామి, తాసిల్దార్ కుసుమ సత్య నారాయణ, ఆయా గ్రామాల సర్పంచులు చిన్నాల తారా శ్రీ రాజబాబు, గారె నరసయ్య, గోవర్ధన్ రెడ్డి, పలు శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
_—————————————
జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి వరంగల్ రూరల్ వారిచే జారీ చేయడమైనది.

Share This Post