వరంగల్ రూరల్: పరిశుభ్రత పాటించడమే పల్లె ప్రగతి లక్ష్యం :::కలెక్టర్ హరిత

ప్రతీ  గ్రామాన్ని  పచ్చదనంగా మార్చడం,పారిశ్యుద్ద  నిర్వహణ పక్కాగా చేపట్టడమే పల్లె  ప్రగతి కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమని జిల్లా కలెక్టర్  హరిత అన్నారు .

పల్లె  ప్రగతిలో  భాగంగా బుధవారం ఉదయం సంగేమ్  మండలం  రామచంద్రపురం, లోహిత  గ్రామలలో,వర్ధన్నపేట  మండలం  చెన్నారం  గ్రామంలో  కలెక్టర్ హరిత  పర్యటించి  పల్లె  ప్రగతి  పనులను పరిశీలించారు.

రామచంద్ర  పురం,  లోహిత  గ్రామాల్లోని  sc  కాలనీ  లలో  RD0,  PD DRDO  ఇతర సంబంధిత అధికారులతో కలెక్టర్ డంప్  యార్డ్, వైకుంఠ  ధామాలను, డ్రైనేజి లను పరిశీలించి  ప్రతీరోజు డ్రైనేజి లను శుభ్రపరచాలని  ఆదేశించారు.


గ్రామ పంచాయితి  సిబ్బంది  ప్రతీ రోజు  గ్రామంలో శానిటేషన్  పనులను  చేపట్టాలన్నారు.రోజూ  ప్రతీ ఇంట్లో చెత్తను సేకరించి  డంప్ యార్డ్  కి తరలించాలన్నారు .

వర్షపు  నీరు  ఎక్కడ నిల్వ  ఉండకుండా  చూసి  సీజనల్  వ్యాధులను  అరికట్టాలన్నారు.పిచ్చి  మొక్కలు ఉన్న చోట వాటిని తొలగించి మంచి మొక్కలను  నాటాలన్నారు.

వైకుంఠ ధామాల, డంప్ యార్డ్  ల చుట్టూ   వివిధ రకాల  మొక్కలను నాటి  బయో ఫెన్సింగ్  ఏర్పాటు చేయాలన్నారు.

స్థానిక  ప్రజా ప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు కలిసి   సమస్య లను పరిష్కరించుకుంటూ అభివృద్ధి  కార్యక్రమలను చేపట్టాలన్నారు. అప్పుడే  ప్రతీ  గ్రామాన్ని  ఆదర్శవంతమైన  గ్రామంగా తీర్చిదిద్దెందుకు  అవకాశం  కలుగుతుందన్నారు .

ఈ కార్యక్రమంలో  PD DRDO సంపత్  రావు, RDO  మహేందర్  జి, ఇతర అధికారులు,  గ్రామ సర్పంచ్  లు పాల్గొన్నారు.

Share This Post