వరంగల్ స్థానిక  సంస్థల నియోజకవర్గ శాసనమండలి స్థానానికి సోమవారం రోజున మూడు నామినేషన్లు దాఖలు అయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ బి గోపి తెలిపారు. 

వరంగల్ స్థానిక  సంస్థల నియోజకవర్గ శాసనమండలి స్థానానికి సోమవారం రోజున మూడు నామినేషన్లు దాఖలు అయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ బి గోపి తెలిపారు.
హనుమకొండ జిల్లా, నడి కూడా మండలం, వరికోల్ గ్రామవాసి పోచంపల్లి శ్రీనివాస రెడ్డి  టిఆర్ఎస్ పార్టీ తరఫున 4 సెట్ల నామినేషన్లు,
మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండలం, తీగల వేణి గ్రామవాసి వేం వాసుదేవ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా ఒక్క సెట్ నామినేషన్,  మహబూబాబాద్ జిల్లా, నెల్లికుదురు మండలం, నైనాల గ్రామవాసి పెరుమాండ్ల గుట్టయ్య స్వతంత్ర అభ్యర్థిగా రెండు సెట్లు నామినేషన్ దాఖలు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి  పేర్కొన్నారు.
నామినేషన్ స్వీకరించిన అనంతరం ఆయా అభ్యర్థుల చే ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో సహాయ ఎన్నికల అధికారి, జిల్లా అదనపు కలెక్టర్ బి హరి సింగ్ మరియు ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post