వరంగల్, హనుమకొండ జిల్లా లకు  సంబందించిన  మున్సిపాలిటీ ల   అభివృద్ధి గురించి హనుమకొండ  కాన్ఫరెన్స్ హల్ లో రివ్యూ చేస్తున్న రాష్ట్ర పురపాలక  శాఖ  మాత్యులు కల్వకుంట్ల తారక  రామారావు  గారు

వరంగల్, హనుమకొండ జిల్లా లకు  సంబందించిన  మున్సిపాలిటీ ల   అభివృద్ధి గురించి హనుమకొండ  కాన్ఫరెన్స్ హల్ లో రివ్యూ చేస్తున్న రాష్ట్ర పురపాలక  శాఖ  మాత్యులు కల్వకుంట్ల తారక  రామారావు  గారు

Press note

                వరంగల్, హనుమకొండ జిల్లా లకు  సంబందించిన  మున్సిపాలిటీ ల   అభివృద్ధి గురించి హనుమకొండ  కాన్ఫరెన్స్ హల్ లో రివ్యూ చేస్తున్న రాష్ట్ర పురపాలక  శాఖ  మాత్యులు కల్వకుంట్ల తారక  రామారావు  గారు ఈ ఆర్ధిక  సంవత్సరంలో మున్సిపాలిటీ లలో  చేపట్టాలిసిన  పనులను  తెలిపిన  రాష్ట్ర పురపాలక  శాఖ  మాత్యులు కల్వకుంట్ల తారకరామారావు Tsbpass ద్వారా మాత్రమే నిర్మాణాలకు అనుమతి  ఇవ్వాలి. లేకపోతే కఠిన  చర్యలు ప్రతీ  మున్సిపాలిటీ లో వెజ్ , నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం కావాలి ప్రతీ  మున్సిపాలిటీ లో వైకుంఠ దామం ఉండాలి గ్రీన్ బడ్జెట్ సద్వినియోగం చేసుకోవాలి ఆధునికమైన  దోబీ గాట్స్ నిర్మాణం కావాలి. బయో మైనింగ్  ప్రక్రియ ద్వారా డంప్ యార్డ్ లో ఉండే చెత్తని  నిర్వీర్యం చేయాలి.  ప్రతి  మున్సిపాలిటీ లో మానవ వ్యర్థాల  శుద్ధి కరణ  ప్లాంట్ ను ఏర్పాటు చేయాలి.  వంద  శాతం  అన్ని ఇళ్లకు రూపాయి నల్లా కనెక్షన్ ఇవ్వాలి అన్ని పట్టణాలలో  మాస్టర్ ప్లాన్ పూర్తి కావాలి.  డిజిటల్ డోర్ నంబరింగ్  ప్రక్రియ వేగవంతం కావాలి. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మునిసిపల్ అస్మినిస్ట్రేషన్ కు 3712 ఉద్యోగుల నియామకానికి కాబినెట్ అమిదించింది. త్వరలో సిబ్బంది కొరత తీరుతుంది. జిడబ్ల్యూ ఎంసిలో ఉన్న 51 వర్క్ ఇన్స్పెక్టర్ లను అబ్జార్బ్ చేస్తాం. మున్సిపాలిటీలో 50 వేల పై ఉన్న జనాభా కు ఒక వార్డ్ ఆఫీసర్ ను నియమిస్తాం. శానిటేషన్ పక్కాగా జరగాలి. స్వచ్ భారత్ మిషన్ గైడ్లైన్స్ ప్రకారం లక్ష మందికి 280 పారిశుధ్య కార్మికులు ఉండేలా చర్యలు తీసుకోవాలి.మంజూరు చేసిన నిధులను ప్రణాళిక బద్దంగా ప్రాధాన్యత క్రమంలో సద్వినియోగం చేసుకోవాలి. TUFIDC లో మంజూరైన నిధులకు పుర్తిగా టెండర్ జరిగి 100 శాతం నిధులు వినియోగం కావాలి.  వరంగల్ స్మార్ట్ సిటీలో పథకంలో రాష్ట్ర వాటా రూ. 250 కోట్లు కట్టేలా చేసేలా  చర్యలు తీసుకోవాలని MAUD స్పెషల్ చీఫ్ సెక్రటరీ ని కోరారు. జిడబ్ల్యూ ఎంసీ కు క్రెడిట్ రేటింగ్ ద్వారా రూ. 90 కోట్ల రుణం HDFC బాంక్ మంజూరు చేస్తున్నందున రెవిన్యూ జనరేటింగ్ ప్రొజెక్ట్ లలో పెట్టాలని అన్నారు. ఈ నిధులతో హన్మకొండ, వరంగల్ బస్ స్టేషన్స్ అభివృద్ధి చేయుటకు చర్యలు తీసుకోవాలి. కుడా క్రియాశీలంగా పని చేయాలి. వర్ధన్నపేట, పరకాల, స్టేషన్ ఘన్పూర్ లలో ల్యాండ్ పూలింగ్, లే ఔట్ ల ద్వారా ఆదాయం పెంచుకొని అభివృద్ధి చేయాలి. మే  20 నుండి జూన్ 5 వరకు  పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమం ఉంటుంది. పక్కా ప్రణాళిక  ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టండి. కాళోజీ కళాక్షేత్రం నిర్మాణం జూన్ 1 నాటికి పూర్తి కావాలి.  పర్యవేక్షించాల్సిందిగా జిడబ్ల్యూఎంసీ కమిషనర్ ను మంత్రి ఆదేశించారు. అంతకుముందు కుడా ద్వారా చేపట్టే నియో రైల్ ప్రాజెక్టు పై పిపిటి ప్రదర్శన ద్వారా కుడా విసి ప్రావీణ్య మంత్రికి వివరించారు. డిపిఆర్ సిద్ధమైన్నందున వెంటనే ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్,ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌, రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, ఎం ఎల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, ఎంపీ లు శ్రీమతి మలోతు కవిత,  ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తక్కళ్లపల్లి రవిందర్‌ రావు,పాడి కౌశిక్ రెడ్డి, జెడ్పి చైర్మన్లు డాక్టర్ సుధీరకుమార్, గండ్ర జ్యోతి, కుసుమ జగదీష్, పాగాల సంపత్ రెడ్డి, ఎమ్మెల్యే లు నన్నపనేని నరేందర్, అరురి రమేష్, చల్లా ధర్మరెడ్డి, తాటికొండ రాజయ్య, రెడ్యా నాయక్, శంకర్ నాయక్, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి,  రాష్ట్ర మునిసిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్, సీడీఎంఏ డాక్టర్ సత్యనారాయణ,  జిల్లా కలెక్టర్ డాక్టర్ పి.గోపి, కుడా చైర్మన్ సుందర్ రాజన్,జిడబ్ల్యూ ఎంసీ కమిషనర్ పి.ప్రావీణ్య, మునిసిపల్ చైర్మన్లు, కమిషనర్ లు, రెవిన్యూ, బల్దియా, పబ్లిక్ హెల్త్, ఎన్ పిడిసిఎల్, నేషనల్ హై వేస్,  ఉన్నత స్థాయి అధికారులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

 

Share This Post