వరంగల్ హెల్త్ సిటీ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం మీడియా సమావేశంలో మంత్రి హరీష్ రావు

 

వరంగల్ హెల్త్ సిటీ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం మీడియా సమావేశంలో మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతూ ….

పనులు వేగంగా జరగాలని అధికారులకు ఆదేశించాం.

వెయ్యి మంది కార్మికులు నిర్మాణ పనుల్లో పాల్గొంటున్నారు.

2100 పడకలు వచ్చేలా డిజైన్ మార్పు చేశాం.

800 పడకలు సూపర్ స్పెషల్ బెడ్స్ ఉన్నాయి.

14 లక్షల ఎస్ఎఫ్టీ నిర్మాణం పూర్తయింది.

దాదాపు 60 శాతం పనులు పూర్తయ్యాయి.

36 రకాల స్పెషాలిటీ సేవలు అందిస్తాం.

వరంగల్ నుండి హైదరాబాద్ కి వైద్యం కోసం పోవాలిసిన అవసరం లేదు

నిమ్స్ లో, ఇతర కార్పొరేట్ హాస్పిటల్ లో ఎలాంటి అత్యాధునిక సేవలు ఉన్నాయి… అవన్నీ వరంగల్ సూపర్ స్పెషలిటీ లో అందనున్నాయి

ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా హాస్పిటల్ చుట్టూ

6 లైన్ రోడ్ నిర్మాణం చేపడుతూనే..

ఎమర్జెన్సీ సర్వీసుల కోసం

అంబులెన్స్ లు ట్రామా కేర్ లోకి సులువుగా వెళ్ళే విధంగా ఉండేందుకు ప్రత్యేకమైన డెడికేటెడ్ రహదారి, ఎంట్రెన్స్ లు ఉంటాయి

కిడ్నీ, లివర్ తదితర మార్పిడి చికిత్స లు జరిగినప్పుడు పేషంట్ బంధువులు ఉండేందుకు వీలుగా హాస్పిటల్ ఆవరణలో 250మంది ఉండే విధంగా అన్నీ సౌకర్యాలతో

ధర్మా శాల నిర్మాణం ఏర్పాటు చేస్తాం

4800 కిలో వాట్స్ పవర్ సప్ప్లై కి అనుగుణంగా 6000 కిలో వాట్స్ సామర్ధ్యం గల జనరేటర్స్ ఏర్పాటు

1200 కిలో లీటర్ ల సామర్ధ్యం తో STP ప్లాంట్ ఏర్పాటు

800కిలో లీటర్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు

400 మంది రెసిడెంట్ డాక్టర్లకు స్పెషల్ రూమ్స్.

450మందితో సమావేశం పెట్టగలిగేలా కాన్ఫెరెన్స్ హల్ ఏర్పాటు

హెల్త్ యూనివర్సిటీతో పాటు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వరంగల్ లో ఉండడం గర్వకారణం.

రాష్ట్రం ఏర్పడిన నాడు వరంగల్ లో ఒకే ఒక్క KMc ఉండేది.. ఈరోజు 7 మెడికల్ కాలేజ్ లో ఈ విద్య సంవత్సరం లో అందుబాటులో కి వస్తున్నాయి

ఇంకా ఒక్కటి మెడికల్ కాలేజ్ ములుగు లో వచ్చే విద్య సంవత్సరానికి ఇవ్వబోతున్నాం

వరంగల్ పై సీఎం కేసిఆర్ గారికి ప్రత్యేక అభిమానం.

ఒకప్పుడు నియోజకవర్గం గా ఉన్న ములుగు లో సైతం ఇప్పుడు మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడం దేశంలోనే రికార్డ్.

మెడికల్ కాలేజ్ ఏర్పాటు వల్ల పేద విద్యార్థులకు వైద్య విద్యo తో పాటు, ఒక్కో కాలేజ్ తో 2000 మందికి ఉపాధి దొరకనుంది

ఉమ్మడి వరంగల్ జిల్లాలో గల ప్రతీ జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసాం

ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలనే ములుగు, భూపాలపల్లి జిల్లాలో మెడికల్ కాలేజ్ లు ఏర్పాటు చేయటం దేశం లోనే రికార్డు

రిమోట్ ఏరియా లో ని ప్రజలకు కూడా అత్యుత్తమ సేవలు అందించాలని మన ముఖ్యమంత్రి గారి ఆలోచన

ఆ ప్రాంతం పిల్లలు అక్కడి కాలేజ్ లోనే చదవడమే మా లక్ష్యం.

రాష్ట్రం ఏర్పడినప్పుడు 2958 Mbbs సీట్లు ఉంటే

కానీ ఇప్పుడు 8340 mbbs సీట్లకి అడ్మిషన్ లు చేయబోతున్నాం

దాదాపు 3 రేట్లు mbbs సీట్లు పెరిగాయి

వైద్య విద్య కోసం రష్యా కో.. చైనాకో పోవలిసిన అవసరం లేదు

మన రాష్ట్రం లోనే చదువుకునే అవకాశాన్ని మన ప్రభుత్వం కల్పించింది

ప్రభుత్వ హాస్పిటల్ లలో డెలివరీ శాతం 70 వరకు నమోదు అవుతున్నాయి

కేసీఆర్ కిట్, ఆరోగ్లక్ష్మి,, న్యూట్రిషన్ కిట్, డాక్టర్ ల నియామకం ఇవన్నీ సౌకర్యాలు కల్పంచడం వల్ల ప్రజలకు ప్రభుత్వ హాస్పిటల్ ల మీద నమ్మకం పెరిగింది

వైద్యం కోసం ప్రభుత్వం 13,000 కోట్ల రూపాయలను కేటాయించడం వల్ల వైద్య సేవలు మెరుగు పడ్డాయి.

Share This Post