వరదల వలన నష్టపోయినా కుటుంబాలను అన్నివిధాలుగా ఆదుకుంటాం… రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి.

పత్రిక ప్రకటన
తేదీ 04.08.2021

ఇటీవలే ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు నష్ట పోయిన వరద బాదితులను బుధవారం జి. ఎన్. ఆర్. కాలనీ ని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా పాలనాధికారి ముషర్రాఫ్ ఫారుఖీ సందర్శించారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా అనుకోని పరిణామం సంబవించిందని, దైర్యంగా ఉండాలని , అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, ఇప్పటి వరకు రోడ్లు , త్రాగు నీరు, విద్యుత్, హౌస్ క్లీన్ , చేయించడం జరిగిందని, ఇంకా మురికి కాలువలు, తదితర పనుల ప్రక్రియ కొనసాగించడం జరుగుతుందని, సన్న బియ్యం సరఫరా చేయడం జరిగిందని అన్నారు.
వరదల వల్ల నష్ట పోయిన వారికి ప్రభుత్వం తరుపున అన్నివిధాలుగా ఆదుకుంటుందని. నివేదిక పంపించడం జరిగిందని అన్నారు.
ఫ్రిజ్, టి. వి కంపెనీ లతో మాట్లాడి తక్కువ ధరకు ఇచ్ఛే విధంగా చూస్తానని, అలాగే ప్రతి ఇంటికి 25 వేల రూపాయలు ఇచ్ఛేందుకు ప్రయత్నం చేస్తానని అన్నారు.
రాబోవు రోజుల్లో అప్రమత్తం గా ఉండాలని స్వర్ణ గేట్లు ఎత్తి వేసే సమయంలో ముందస్తు సమాచారం ఇవ్వడానికి సైరన్ ఏర్పాటు చేస్తామని అన్నారు.
జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ వరదల వలన ఆస్తి నష్టం జరిగింది కానీ ప్రాణాలు పోకుండా రక్షించగాలిగామని అన్నారు. రికార్డు స్థాయిలో అదిక వర్షం నమోదు కావడం వలన ఈ పరిస్థితి గోచరించిందని అన్నారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని, వైద్య సదుపాయం అందిస్తామని, ఏమైన సమస్యలు ఉంటే రెవెన్యు దృష్టికి తీసుకురావాలని, అన్ని వేళలా అండగా ఉంటామని, ఇరిగేషన్, విద్యుత్, రెవెన్యు, మున్సిపల్ అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, కమిషనర్ బాలకృష్ణ, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
అనంతరం సిద్దాపూర్ వాటర్ ప్లాంటేషన్, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు.

 

జిల్లా పౌరసంబంధాల అధికారి నిర్మల్ చే జారీ చేయనైనది.

Share This Post