వరద జనావాసాలను ముంచెత్తకుండా ఉండేందుకు అవసరమైన పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

*వరద జనావాసాలను ముంచెత్తకుండా ఉండేందుకు అవసరమైన పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి : జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి*
—————————–
సిరిసిల్ల పట్టణంలో శాంతి నగర్ లో గతేడాది వర్షాకాలం వరద జనావాసాలను ముంచెత్తిన దృష్ట్యా ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని,
ఆ కష్టాలు పునరావృతం కాకుండా అవసరమైన పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు.

రెవెన్యూ, మున్సిపల్, రహదారులు, భవనాల శాఖ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్, నీటి పారుదల అధికారులతో కలిసి బుధవారం జిల్లా కలెక్టర్ గత సంవత్సరం సిరిసిల్ల పురపాలక సంఘం పరిధిలోని ఫ్లడ్ ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు.

మొదట పట్టణంలోని శ్రీనగర్, శాంతి నగర్, కలెక్టరేట్, కొత్త చెరువు పరిసర ప్రాంతాలు, EVM గోడౌన్ కల్వర్టు , రగుడు – వెంకటా పూర్ , కలెక్టరేట్ – ఎల్లమ్మ తల్లి బై పాస్ రోడ్డు లను జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

వచ్చే వర్షాకాలంలో శాంతి నగర్ కాలనీలో
వరద జనావాసాలను ముంచెత్తకుండా నీటిని మళ్లించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై అధికారులతో చర్చించి సంబంధిత పనులు c చేపట్టాలని జిల్లా కలెక్టర్ మున్సిపల్ అధికారులకు సూచించారు. ప్రగతిలో ఉన్న నాలా విస్తరణ పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు.

కలెక్టరేట్ – ఎల్లమ్మ తల్లి బై పాస్ రోడ్డును రెండు వరుసల నుండి నాలుగు వరుసల గా అభివృద్ధి చేస్తున్న దృష్ట్యా కల్వర్టు , రోడ్డు నిర్మాణ పనులు వేగంగా జరిగేలా చూడాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు.

అదేవిధంగా రగుడు – వెంకటా పూర్ బై పాస్ రోడ్డు తారు రోడ్డు పనులను జూన్15 వ తేదీ నాటికి పూర్తి చేయాలన్నారు.

క్షేత్ర పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట ఆర్డీఓ టి శ్రీనివాస్ రావు, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, ఆర్ అండ్ బి EE కిషన్ రావు, నీటి పారుదల శాఖ EE అమరేందర్ రెడ్డి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకులు శ్రీనివాస్, తహసీల్దార్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

——————————

Share This Post