వరికి ప్రత్యామ్నాయ పంటలను పండించాలి :-జిల్లా కలెక్టర్ డి హరిచందన

వరికి ప్రత్యామ్నాయ పంటలను పండించాలి :-జిల్లా కలెక్టర్ డి హరిచందన

సోమవారం నారాయణపేట మండలం సింగారం గ్రామం లో  జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా కేంద్రంలో వ్యవసాయ శాఖ అధికారులందరికీ యాసంగి కాలంలో వరికి ప్రత్యామ్నాయంగా పండించే ఆరుతడి పంటలపై అవగాహన కల్పించేందుకు జిల్లా వ్యవసాయ అధికారులతో జిల్లా కలెక్టర్ డి హరిచందన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్  మాట్లాడుతూ  యాసంగి కాలంలో పండించే వరిని ఎఫ్ సి ఐ  వారు కొనుగోలు చేయటం లేదు కాబట్టి రైతుసోదరులందరూ గమనించి వరికి ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపేలా  వ్యవసాయ అధికారులు రైతులకు ప్రోత్సహించాలని  సూచించారు.  రైతులకు అవగాహన కలిగించాలని, ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యం నిర్ణయించుకుని రైతులచే వరి పంట సాగును విరమించుకుని ఆరుతడి పంటలైన నువ్వులు, రాగులు, పెసర్లు, మినుములు,  అదే విధంగా కుసుమ, వేరుశెనగ వంటి నూనెగింజల పంటల సాగుపై అవగాహన కలగచేయాలన్నారు. రైతు లందరికీ  సమాచారం తప్పనిసరిగా చేరే విధంగా తగు చర్యలు చేపట్టాలని  జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. ప్రత్యామ్నాయ పంటల ద్వారా కూడా అధిక లాభాలు పొందవచ్చని రైతు కూడా సహకరించి వ్యవసాయ శాఖ తెలియజేసిన సూచనలు సలహాలు పాటించాలని సమావేశంలో ఈ సమావేశం లో తెలిపారు.  ప్రతి వ్యవసాయ విస్తరణ అధికారి దీన్ని ఒక బాధ్యతగా స్వీకరించి తప్పనిసరిగా  రైతులకు అవగాహన కల్పించి  ఆరుతడి పంటల సాగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.  అదే విధంగా ఆరుతడి పంటల  విత్తనాలు లభ్యత  అందుబాటులో ఉండేటట్లు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.  సంబందిత వ్యవసాయ పరిశోధన కేంద్రాల నుంచి అదే విధంగా వ్యవసాయ యూనివర్సిటీల నుంచి తెప్పించే బాధ్యత వ్యవసాయ శాఖ తీసుకోవాలని  తెలిపారు. ఆయిల్ ఫారం  పంటల సాగు వైపు ప్రతి ఒక్కరు మొగ్గు చూపాలని ఆసక్తి ఉన్న రైతులు ముందుగా దరఖాస్తు చేసుకుంటే ముందుగా దరఖాస్తు చేసుకున్న రైతులకు త్వరగా ఆయిల్ పామ్ మొక్కలు అందించడం జరుతోందన్నారు. రైతులతో వ్యవసాయ  అధికారులు సమావేశం నిర్వహించి  కొర్ర, రాగి వంటి సూక్ష్మ ధాన్యాలను పండించేటట్లు చేయాలని అదేవిధంగా నూనెగింజల పంటల వైపు కూడా రైతు సోదరులు మొగ్గు చూపే విధంగా కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరుపున యాసంగి కాలంలో ఎలాంటి  వరి కొనుగోలు కేంద్రాలు ఉండవు కావున ప్రతి రైతు లకు  ఈ విషయాన్ని తెలియజేయాలన్నారు.  ప్రతి గ్రామంలో సమావేశాలు అవగాహన సదస్సులు నిర్వహించి  ప్రతి సమాచారం రైతులకు చేరే విధంగా వ్యవసాయ శాఖ ప్రయత్నించాలని సూచించారు. ఉద్యాన అధికారులు రైతు  కూరగాయల సాగు ద్వారా అధిక లాభాలు ఆర్జించ వచ్చని తక్కువ కాలంలో ఎక్కువ లాభాలను తీసుకువచ్చే కూరగాయల పంటలు క్యారెట్ ,దొండ, క్యాప్సికం వంటి పంటలను పండించేటట్లు చర్యలు చేపట్టాలన్నారు. ఉద్యాన పంటల పై సాగుకు అవగాహన కలిగించడానికి ఉద్యానశాఖ అధికారులు రైతులకు సలహాలు  తెలియజేయలన్నారు.  చౌడు నేలలు ఉన్న రైతులు వరికి ప్రత్యామ్నాయంగా రాగులు సాగు చేసుకోవచ్చని సూచించరు.

ఈ సమావేశంలో రాష్ట్ర Agros MD శ్రీ రాములు,డాట్ సెంటర్  శాస్త్రవేత్త అర్చన, జిల్లా వ్యవసాయ అధికారి సుధాకర్, జిల్లా డిఆర్డిఎ పిడి గోపాల్,జిల్లా ఉద్యాన వన అధికారి వెంకటేశ్వర్లు,  సహాయ వ్యవసాయ సంచాలకులు దైవగ్లోరి మరియు  వివిధ మండలాల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు తది తరులు పాల్గొన్నారు.

Share This Post