వరికి ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన సదస్సు నిర్వహించిన జిల్లా వ్యవసాయ అధికారి రణధీర్ రెడ్డి

వరికి ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన సదస్సు నిర్వహించిన జిల్లా వ్యవసాయ అధికారి రణధీర్ రెడ్డి

*ప్రచురణార్థం-2*

రాజన్న సిరిసిల్ల, డిశంబర్ 5: ఆదివారం తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో యాసంగి 2021-22 లో పంట మార్పిడి, వరికి ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి రణధీర్ రెడ్డి మాట్లాడుతూ, యాసంగి కాలంలో భారత ఆహార సంస్థ/భారత ప్రభుత్వం వరి పంటను కొనుగోలు చేయమని చెప్పి నందున, వరి కొనుగోలు కేంద్రాల నిర్వహణ ఉండదని అన్నారు. రైతులందరూ వరికి ప్రత్యామ్నాయ పంటలైన మినుము, పెసర్లు, నువ్వుల పంట సాగు పై దృష్టి సారించాలని ఆయన తెలిపారు. ప్రత్యామ్నాయ పంటల గురించి రైతులకు ఆయన వివరించారు. మినుము పంటను నవంబర్ 15 నుండి డిసెంబర్ 15 వరకు PU-31,LBG-752,LBG-20 రకాలను వేసుకోవచ్చని రైతులకు ఆయన తెలిపారు. విత్తన మోతాదు 6-8 కేజీలు, దిగుబడి ఎకరానికి సుమారు 5 నుంచి 6 క్వింటాళ్ల వరకు ఉంటుందన్నారు. పెసర పంట నవంబర్ 15 నుండి డిసెంబర్ 15 వరకు MGG295, WGG37, WGG42 రకాలను వేసుకోవచ్చని, విత్తన మోతాదు ఎకరానికి 6-8 కిలోలు అవుతుందని, దిగుబడి సుమారు 4 నుండి 6 క్వింటాళ్లు ఉంటుందన్నారు. అదే విధంగా నువ్వులు జనవరి 15 నుండి ఫిబ్రవరి 15 వరకు శ్వేత, హిమ, JCS 1020 రకాలు, ఎకరానికి విత్తన మోతాదు 2 నుండి 2.5 కిలోలు అవుతుందని, దిగుబడి సుమారుగా 2-3 క్వింటాళ్ల వరకు వస్తుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించి కరపత్రాలను, పంట యాజమాన్య పుస్తకాలను రైతులకు అందించారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సందీప్, గ్రామం సర్పంచ్ గనుప శివజ్యోతి, అధికారులు రైతులు పాల్గొన్నారు.

Share This Post