వరికి బదులుగా ఆరుతడి పంటల సాగును చేపట్టాలి…

ప్రచురణార్థం

వరికి బదులుగా ఆరుతడి పంటల సాగును చేపట్టాలి…

పెద్దవంగర
మహబూబాబాద్, డిసెంబర్ 7.

భారత ఆహార సంస్థ ఎఫ్సీఐ వరి ధాన్యం కొనుగోలు చేయలేమని తేల్చిచెప్పినందున రైతులు వరికి బదులుగా ఆరుతడి పంటల సాగును చేపట్టాలని జిల్లా కలెక్టర్ శశాంక కోరారు.

మంగళవారం పెద్ద వంగర మండలం బొమ్మకల్ గ్రామంలో వరి పంటకి బదులుగా ఆరుతడి పంటల సాగును చేపట్టేందుకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతుల అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రైతులు మార్కెట్ విధానాన్ని అవగాహన పంచుకోవాలని డిమాండ్ ఉన్న పంటలను చేపట్టి ఇ ఆర్థిక అభివృద్ధి చెందాలని అన్నారు.

చిట్యాల క్లస్టర్ కింద ఉన్న బొమ్మకల్ గ్రామ రైతాంగంకు గత నాలుగు సంవత్సరాలుగా పండిస్తున్న వరి పంట వలన వచ్చిన లాభాలను అదేవిధంగా ఇతర పంటల వలన వచ్చే లాభాలను అధికారులు వివరించారు.

ఆరుగాలం కష్టించి రైతు శ్రమ వృధా కారాదని ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ తెలియజేశారు ఇప్పటికే ధాన్యపు రాశులు పేరుకుపోయాయి ధాన్యం కొనుగోలు చేసినా నిలువచేసే చోటు కూడా లేదన్నారు.

నువ్వులు పెసలు జామ బొప్పాయి వంటి పంటలు వేస్తూ రాణిస్తున్న పలువురు రైతులు అభిప్రాయాలను వారిచేత రైతులకు వివరింప చేశారు.

అనంతరం కలెక్టర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ప్రతి గింజ కొనుగోలు చేస్తామని రైతులు అధైర్యపడవద్దు అన్నారు ఇక నుండైనా వరి పంట వేయకుండా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలన్నారు దాన్యం కొనుగోలు సజావుగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

ఈ అవగాహన కార్యక్రమంలో జడ్పిటిసి జ్యోతిర్మయి ఎంపీపీ ఈదుల రాజేశ్వరి ప్రాథమిక సహకార సంఘ సభ్యులు హరి ప్రసాద్ సర్పంచ్ దీపిక ఎంపీటీసీ రవీందర్ నెహ్రూ నాయక్ జిల్లా వ్యవసాయ అధికారి చత్రు నాయక్, ఉద్యాన అధికారి సూర్యనారాయణ డి ఆర్ డి ఎ పిడి సన్యాసయ్య, తాసిల్దార్ సరిత రాణి తదితరులు పాల్గొన్నారు
———————————————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post