వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేయాలి.. జిల్లా కలెక్టర్ నిఖిల.

మార్కెట్ లో ఎదురవుతున్న సమస్యలు, క్షేత్ర స్థాయిలో దీర్ఘాకాలిక దృష్టితో వనరులను సక్రమంగా వినియోగించు కోవడంలో భాగంగా వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని జిల్లా కలెక్టర్ నిఖిల తెలిపారు.

శనివారం కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన “యాసంగిలో వరికి బదులుగా ఇతర పంటల సాగు ” అనే పోస్టరు మరియు బుక్లేట్లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో వానాకాలం, యాసంగి రెండు కాలాలలో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని, వరి కొనుగోలుకు మార్కెట్ ఇబ్బందులు తలెత్తడంతో రైతులకు ఇబ్బంది కలుగుతుందని, వరి తరువాత వరి పండించడం వల్ల పంటల వైవిద్యం కూడా దెబ్బ తింటుందని తెలిపారు. జిల్లాలో పప్పు దినుసులు, నూనె గింజలు, కూరగాయలు అవసరానికి, ఉత్పత్తికి మధ్య గణనీయమైన వ్యత్యాసం ఉందని, అందువలన వివిధ రాకాలైన పప్పుజాతి పంటలు, కూరగాయలు, నూనె గింజ పంటలను సాగు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా జిల్లాలో అనుకూలమైన వేరుశనగ, శనగ, ఆవాలు, నువ్వులు, కుసుమ, ఆముదం, పెసర, మినుములు, పొద్దుతిరుగుడు, జొన్న లాంటి పంటలు పండించి రైతులు లాభలను అర్జీంచాలన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్ సిబ్బంది ఆదితరులు పాల్గొన్నారు.
—————————————-
జిల్లా పౌర సంబంధాల అధికారి వికారాబాద్ జిల్లా గారిచే జారీచేయనైనది

Share This Post