వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను వేయాలి …

ప్రచురణార్థం

వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను వేయాలి …

తొర్రూరు
మహబూబాబాద్, డిసెంబర్ 7.

భారత ఆహార సంస్థ ఎఫ్సీఐ వరి ధాన్యం కొనుగోలు చేయలేమని తేల్చిచెప్పినందున రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను వేయాలని జిల్లా కలెక్టర్ శశాంక కోరారు.

మంగళవారం తొర్రూరు మండలం హరిపిరాల రైతువేదికలో వరి పంటకి బదులుగా ఆరుతడి పంటల సాగును చేపట్టేందుకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులతో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు మూస విధానంలో ఒకే పంటను చేపట్టడం వలన మార్కెట్ ధరలు పడిపోవడం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్కెట్ లో డిమాండ్ లేకపోవడం నష్టపోయే ప్రమాదం ఉందన్నారు రైతులు సాగు విధానాన్ని మార్చుకోవాలని ప్రత్యామ్నాయ పంటలు చేపట్టి ఆర్థిక అభివృద్ధి చెందాలని అన్నారు డిమాండ్ ఉన్న పంటలను చేపట్టి రాణిస్తున్న రైతుల అభిప్రాయాలను వారిచేత నే సమావేశంలో చెప్పించారు.

గ్రామ రైతాంగం గత నాలుగు సంవత్సరాలుగా పండిస్తున్న వరి పంట వలన వచ్చిన లాభాలను ఇతర పంటల వల్ల వచ్చిన లాభాలను తెలియజేస్తూ వాటిపై అవగాహన పెంపొందించారు.

ఆరుగాలం కష్టించి రైతు శ్రమ వృధా కారాదనేది ప్రభుత్వ ఉద్దేశమన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇక ముందు కాలంలో ఉండబోవని తెలియజెప్పారు ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల సాగుకు అందజేసే సబ్సిడీలను కూడా పొందవచ్చునన్నారు .

విత్తనాలకు విక్రయాల కై మిల్లర్స్ కోరికమేరకు వరి పంట వేసుకోవచ్చునని రైతులు అర్థం చేసుకోవాలన్నారు

నువ్వులు పెసలు జామ బొప్పాయి మినుములు వంటి పంటలు వేస్తూ రాణిస్తున్న పలువురు రైతులు అభిప్రాయాలను వారిచేత రైతులకు వివరింపచేశారు. వరి పంట వలన రైతుకు లాభాలు చేకూరవని , నష్టాలే ఎక్కువగా వస్తాయని తెలియజేశారు

అనంతరం కలెక్టర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ప్రతి గింజ కొనుగోలు చేస్తామని రైతులు అధైర్యపడవద్దు అన్నారు ఇక నుండైనా వరి పంట వేయకుండా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలన్నారు దాన్యం కొనుగోలు సజావుగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

ఈ అవగాహన కార్యక్రమంలో జడ్పిటిసి శ్రీనివాస్ ప్రాథమిక సహకార సంఘ సభ్యులు హరి ప్రసాద్ ఎంపీటీసీ వల్లపు గోపమ్మ జిల్లా వ్యవసాయ అధికారి చత్రు నాయక్, ఉద్యాన అధికారి సూర్యనారాయణ డి ఆర్ డి ఎ పిడి సన్యాసయ్య, తాసిల్దార్ రాఘవరెడ్డి ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు
————————————————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post