వరి దాన్యం కొనుగోలు పై రైస్ మిల్లర్లతో జరిగిన సమీక్షా సమావేశం మాట్లాడుతున్న అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్. (కరీంనగర్ జిల్లా)

ఖరీఫ్ ధాన్యాన్ని రైస్ మిల్లర్లు త్వరితగతిన దించుకొని రైతులకు సహకరించాలి

స్టాక్ రిజిస్టర్లు, ధాన్యం బస్తాలను క్రమ పద్ధతిలో ఉంచుకోవాలి

యాసంగి, ఖరీఫ్ ధాన్యంకు సంబంధించిన రిజిస్టర్లు అప్డేట్ ఉండాలి

జిల్లా అదనపు కలెక్టర్ జీవి శ్యాం ప్రసాద్ లాల్

000000

యాసంగి సీజన్ 2021 – 22 కు సంబంధించిన ధాన్యంను త్వరితగతిన దించుకొని రైతులకు సహకరించాలని జిల్లా అదనపు కలెక్టర్ జివి శ్యామ్ ప్రసాద్ లాల్ రైస్ మిల్లర్ల ను ఆదేశించారు.

శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో యాసంగి సీజన్ 2020 -21, వానాకాలం సీజన్ 2021 -22 కు గాను సీఎంఆర్ ధాన్యం పై రా మరియు బాయిల్డ్ రైస్ మిల్లర్స్, పౌరసరఫరాల శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎఫ్. సి. ఐ. అధికారులు రైస్ మిల్లులలో నిర్వహించబోతున్న తనిఖీలలో సంబంధించిన స్టాక్ రిజిస్టర్లను మరియు బస్తాలను క్రమపద్ధతిలో ఉంచుకోవాలని ఆయన ఆదేశించారు. యాసంగి సీజన్ 2021-22 కు సంబంధించిన ధాన్యమును త్వరితగతిన దించుకొని రైతులకు సహకరించాలని ఆదేశించారు. ధాన్యం సరిగా ఉండే విధంగా చూసుకోవాలని రైతులతో ఎంతో ఓపిక తో మాట్లాడాలని అధికారులు ఒక బృందంగా ఏర్పడి సమన్వయంతో పనిచేయాలన్నారు.

ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి సురేష్ రెడ్డి, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి, రైస్ మిల్లర్స్ తదితరులు పాల్గొన్నారు

Share This Post