వరి ధాన్యం కొనుగోళ్ళు వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు.

శనివారం  రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణా రావు,  రాష్ట్ర వ్యవసాయశాఖ  సెక్రెటరీ రఘునందన్ రావు, రాష్ట్ర సివిల్ సప్లై కమిషనర్ అనిల్  కుమార్,   ఇతర ఉన్నత అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు,  జిల్లా పోలీసు సూపరింటెండెంట్లతో  వానాకాలం వరి ధాన్యం కొనుగోళ్ళు,  వచ్చే యాసంగిలో పంటల సాగు పై జిల్లాల వారీగా సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేయాలని,  రైతులకు ఎలాంటి సమస్యలు రాకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని తెలిపారు. కొనుగోలు, రవాణా ప్రక్రియలో పోలీసు, రెవెన్యూ,రవాణా శాఖల అధికారులు సమన్వయంతో  ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఇతర రాష్ట్రాల నుండి ధాన్యం రాకుండా, దళారీల వ్యవస్థ లేకుండా  పఠిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు.
రాష్ట్రంలో ఉన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా యాసంగి వరి పంట పార బాయిల్డ్ రైస్ మాత్రమే తయారవుతుందని,  కేంద్ర ప్రభుత్వం మరియు ఎఫ్.సి.ఐ బాయిల్డ్ రైస్ కోనుగోలు నిరాకరిస్తున్న నేపథ్యంలో వరి పంట సాగు శ్రేయస్కరం కాదని పేర్కొన్నారు. వచ్చే యాసంగిలో వరి పంటకు బదులుగా ఇతర ప్రత్యామ్నాయ పంటలు వేసేలా గ్రామాలలోని రైతు వేదిక భవనాలలో  ప్రతి రోజూ రైతులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని,  పంటల సాగు పధ్ధతులు, ఎరువులు తదితరుల విషయాలపై  వ్యవసాయ అధికారుల ద్వారా సలహాలు, సూచనలతో  కార్యక్రమాలు రూపొందించాలని తెలిపారు. పెండింగ్  మిల్లింగ్ లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు.
రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ,  ఇతర రాష్ట్రాలలో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసి మన రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో విక్రయించే మధ్య దళారీలపై పూర్తి నిఘా పెట్టాలని, అక్రమ రవాణా అరికట్టాలని, సరిహద్దు  ఉమ్మడి జిల్లాల పోలీసు, రెవెన్యూ అధికారులు ఒక టీమ్ లాగా అప్రమత్తంగా పనిచేయాలని తెలిపారు.
జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ యాసంగి లో పంటల సాగు, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికపై రైతులకు గ్రామ గ్రామాన అవగాహన కల్పిస్తామని అన్నారు.జిల్లాలో 202 కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోళ్లు నిర్వహిస్తున్నట్లు,ధాన్యం రాక నముసరించి  కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని అన్నారు.
డి.ఐ. జి.ఏ.వి.రంగనాథ్ మాట్లాడుతూ సరిహద్దు జిల్లా ల యంత్రాంగం తో సమన్వయం తో కలిసి జిల్లా సరిహద్దు లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి జిల్లాలోకి ధాన్యం రవాణా పై నిఘా ఏర్పాటు చేస్తామని అన్నారు.
వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, పౌర సరఫరాల డి.యం.నాగేశ్వర్ రావు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి,మార్కెటింగ్ అధికారి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు

వరి ధాన్యం కొనుగోళ్ళు వేగవంతం చేయాల:: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్

Share This Post