వరి పంటకు మద్దతు ధర,నాణ్యతా ప్రమాణాలపై పౌరసరఫరాల శాఖ రూపొందించిన పోస్టర్,కరపత్రాలు ఆవిష్కరించిన అదనపు కలెక్టర్

పత్రికా ప్రకటన వరి పంటకు మద్దతు ధర,నాణ్యతా ప్రమాణాలపై పౌరసరఫరాల శాఖ రూపొందించిన పోస్టర్,కరపత్రాలు ఆవిష్కరించిన అదనపు కలెక్టర్ నల్గొండ,నవంబర్ 2.పౌర సరఫరాల శాఖ వరి పంటకు మద్దతు ధర,నాణ్యతా ప్రమాణాల పై రూపొందించిన పోస్టర్,కరపత్రం లను అదనపు కలెక్టర్ వనమాల చంద్ర శేఖర్ మంగళ వారం తన క్యాంపు కార్యాలయం లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తాము పండించిన వరి దాన్యం ను ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాలను తీసుకు వచ్చి మద్దతు ధర పొందాలంటే రైతులు కేంద్ర ప్రభుత్వ నిబంధనలు పాటించాలని ఆయన అన్నారు.రైతులు ధాన్యాన్ని బాగా ఆరబెట్టి,చెత్త- తాలు,మట్టి పెడ్డలు,రాళ్లు లేకుండా శుభ్రపరచాలని సూచించారు.వరి పంటకు మద్దతు ధర క్వింటాల్ కు గ్రేడ్ ^ఏ^రకానికి రూ.లు 1960 రూ.లు,సాధారణ రకానికి రూ.లు 1940 చెల్లించడం జరుగుతుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం దాన్యం కొనుగోలు లో చెల్లింపు లో మధ్య వర్తుల ప్రమేయానికి ఏ మాత్రం ఆస్కారం లేకుండా ఆన్ లైన్ (ఓ.పి.ఎం.ఎస్)విధానాన్ని తీసుకు వచ్చి దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు.కనీస మద్దతు ధరకు నాణ్యతా ప్రమాణాలు ఉన్న దాన్యం కొనుగోలు చేసి ఆన్లైన్ ద్వారా నేరుగా రైతు ఖాతా లోనికి దాన్యం డబ్బు జమ చేయడం జరుగుతుందని అన్నారు.దాన్యం విక్రయించే రైతులు తమ ఫోన్ నంబర్ ను ఆధార్ కార్డ్ నంబర్ తో అనుసంధానం చేసుకున్న తర్వాతే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకు రావాలని(బ్యాంక్ లు,ఆధార్ కేంద్రాలు,పోస్ట్ ఆఫీస్ లు,మీ సేవా కేంద్రాల్లో అనుసంధానం చేసుకోవచ్చు) అన్నారు.కొనుగోలు కేంద్రం లో దాన్యం విక్రయించే సమయం లో ఓ.టి.పి.నంబర్ కోసం ఈ ఫోన్ ను రైతులు తమ వద్ద ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలని, ఓ.టి.పి.నంబర్ వచ్చిన తర్వాతే దాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభం అవుతుందని అన్నారు.ఆధార్ కార్డ్,జిల్లా కలెక్టర్ చే నియమించబడిన అధికారి ధృవీరకరణ పత్రం, పట్టా దార్ పాస్ పుస్తకం ,బ్యాంక్ ఖాతా నంబర్,ఐ. ఎఫ్.ఎస్.సి కోడ్(బ్యాంక్ పాస్ పుస్తకం కాఫీ)జత చేయాలని అన్నారు.బ్యాంక్ ఖాతా పని చేస్తున్నట్లు గా బ్యాంక్ అధికారుల నుండి ధ్రువీకరించు కోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు,పౌర సరఫరాల సంస్థ డి.యం.నాగేశ్వర్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post