వరి పంట దిగుబడి ప్రయోగాలను పరిశీలించిన కలెక్టర్

ప్రచురణార్థం

వరి పంట దిగుబడి ప్రయోగాలను పరిశీలించిన కలెక్టర్

కురవి
మహబూబాబాద్, డిసెంబర్ 4.
జిల్లాలోని కురవి మండలం లింగ్యా తండాలో వరి పంట దిగుబడి ప్రయోగాలను జిల్లా కలెక్టర్ శశాంక శనివారం సందర్శించి పరిశీలించారు.

ఈ సందర్భంగా కురవి గ్రామపంచాయతీ పరిధిలోని లింగ్యా తండా గ్రామంలో 259/9 సర్వేనెంబర్ లో ని వరి పంట దిగుబడిని ఐదు మీటర్ల పొడవు ఐదు మీటర్ల వెడల్పు తీసుకొని అంచనా వేశారు.

పంటను కోయించి తూర్పార బట్టి వేయింగ్ మిషన్ పై కొలిచారు పంటల ప్రయోగం అంచనా సందర్భంగా వివరాలను గణాంక అధికారులు కలెక్టర్ కి తెలియజేశారు అనంతరం కలెక్టర్ రైతులతో మాట్లాడారు భూక్యా కిషన్ మంగత్య హార్వెస్ట్ కోతకు ఎకరానికి ఐదు వేల నుండి ఆరు వేల వరకు ఖర్చు వస్తుందని కూలీలతో చేయిస్తే రెండు వేల నుండి మూడు వేల వరకు ఖర్చు వస్తుందని తెలియజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ దాన్యం కొనుగోలు కేంద్రాలకు కూడా ఇలాగే తూర్పారబట్టిన నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువెళ్లాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో సి పి ఓ సుబ్బారావు ఉప ఎస్ ఓ లు కృష్ణారావు సురేష్ తాసిల్దార్ తరంగిణి ఎంపీడీవో దన్సింగ్ వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు
————————————————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post