*#ప్రతి రోజు టోకెన్ లు జారీ,మిల్లుల సామర్థ్యము ననుసరించి టోకెన్ లు జారీ* *#రైతులకు మంచి ధర వచ్చేందుకు రద్దీ నియంత్రణకు టోకెన్ లు వ్యవసాయ అధికారులు జారీ:జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,డి.ఐ. జి.ఏ.వి.రంగ నాథ్* నల్గొండ,నవంబర్ 6. జిల్లాలో రైతులకు ఇబ్బంది లేకుండా మిల్లుల వద్ద రద్దీ లేకుండా రైతులు ఎక్కువ రోజులు వేచివుండకుండా క్రమ పద్ధతి లో వరి సన్న ధాన్యం కొనుగోలుకు టోకెన్ల ను జారీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,డి.ఐ. జి.ఏ.వి.రంగ నాథ్ లు తెలిపారు.శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో డి.ఐ. జి.ఏ.వి.రంగ నాథ్ తో కలిసి వరి సన్న దాన్యం కొనుగోలు కు టోకెన్ జారీ విధానం పై పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించి వారు వివరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ శాఖ అధికారులు,పోలిస్ అధికారులు,పౌర సరఫరాల శాఖ,వ్యవసాయ శాఖ అధికారులు,మిల్లర్ లు,రైతు లతో సమావేశం జరిపి టోకెన్ జారీ విధానం పై చర్చించినట్లు,అధికారులు,రైతులు, మిల్లర్ ల సలహాలు ,సూచనలు తీసుకున్నట్లు తెలిపారు.సన్న దాన్యం ప్రైవేట్ గా మిల్లర్ లు రైతుల నుండి 5 సంవత్సరాల నుండి కొనుగోలు చేయడం జరుగుతుందని అన్నారు.వరి కొత ఒకే సారి జరిగి రోజుకు 2000 నుండి 3000 ట్రాక్టర్ లు వస్తాయని, సన్న దాన్యం కొనుగోలుకు టోకెన్ లు జారీ అమలు చేస్తున్నట్లు తెలిపారు.గతం లో మూడు నుండి నాలుగు రోజులు రైతులు వేచి వుండే వారని,టోకెన్ ల జారీ తో 24 గంటలు నుండి గరిష్టంగా 36 గంటల లోగా క్లియర్ అవుతుందని అన్నారు.రైతులు క్రమ శిక్షణతో, స్వీయ నియంత్రణ పద్ధతి లో టోకెన్ పొందిన తర్వాత వరి సన్న ధాన్యం నిర్ణ యించిన తేదీ లో తీసుకురావాలని అన్నారు.సమావేశం లో చర్చించిన తర్వాత సూచనలు మేరకు టోకెన్ లు పెంచాలని నిర్ణయించి నట్లు, ,ప్రతి రోజు టోకెన్ లు జారీ చేయనున్నట్లు,మిల్లుల కెపాసిటీ అనుసరించి టోకెన్ లు జారీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.మిర్యాలగూడ 82 మిల్లు లు ఉన్నాయని,20 మిల్లులు సి.యం.ఆర్ డెలివరీ చేస్తున్నట్లు,5 మిల్లు లు రిపేర్ లో ఉన్నట్లు,అధికారులు విచారణ జరుపుతు న్నట్లు తెలిపారు.57 మిల్లులు కొనుగోలు చేస్తున్నాయని అన్నారు.టోకెన్ ల జారీ వచ్చే పెంచనున్నట్లు,వచ్చే నాలుగు రోజుల్లో పెంచటం జరుగుతుందని,1500 నుండి 2000 టోకెన్ లు ప్రతి రోజు జారీ చేసేలా వేసులు బాటు ఉందని,జిల్లా యంత్రాంగం ఈ దిశగా చర్యలు తీసుకుంటుందని అన్నారు.రైతు వేదికల వద్ద టోకెన్ లు జారీ చేస్తున్నట్లు తెలిపారు.ట్రాక్టర్ ఒకటి కి రెండున్నర నుండి 3 ఎకరాల దిగుబడి వస్తుందని,3 ఎకరాలకు ఒక టోకెన్,6 ఎకరాలకు రెండు టోకెన్ లు ఇస్తామని అన్నారు.జిల్లాలో 90 శాతం 5 నుండి 6 ఎకరాల లోపు కలిగిన చిన్న సన్నకారు రైతాంగం ఉన్నారని అన్నారు.సన్న రకం వరి ధాన్యం ప్రైవేట్ గా మిల్లులు వద్ద కొనుగోలు చేసేందుకు మాత్రమే టోకెన్ విధానం అమలు లో ఉందని, జిల్లాలో దొడ్డు దాన్యం సేకరణకు 180 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు,70 కేంద్రాలు ప్రారంభం అయినట్లు తెలిపారు. దొడ్డు దాన్యం 17 శాతం తేమ మించకుండా ఆరబెట్టి నాణ్యతా ప్రమాణాల మేరకు నేరుగా ఐ. కె.పి.,పి.ఏ.సి.ఎస్ కొనుగోలు కేంద్రాలకు తీసుకు వచ్చి మద్దతు ధర పొందాలని అన్నారు. డి. ఐ. జి.ఏ.వి.రంగ నాథ్ మాట్లాడుతూ రైతులకు మంచి ధర లభించేలా ఎక్కువ వేచి ఉండకుండా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని అన్నారు. పోలీస్ శాఖ తరపున బందోబస్తు ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.మిల్లర్ లు కూడా నాణ్యత బట్టి మద్దతు ధర చెల్లింపు చేస్తారని,మద్దతు ధర తక్కువ చెల్లింపు చేస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు.రైతులు కోత తర్వాత ఆరబెట్టి తీసుకు వస్తే తేమ శాతం తో మంచి ధర లభిస్తుందని అన్నారు.ఈ సమావేశం లో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.చంద్ర శేఖర్,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ,జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.