వర్షపు నీటిని త్రాగు నీటిగా మార్చే నిర్మాణ ప్రక్రియను ప్రారంభోత్సవం చేసిన గౌరవ నర్సంపేట శాసనసభ్యులు శ్రీ. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు

_*”వర్షపు నీటిని త్రాగు నీటిగా మార్చే నిర్మాణ ప్రక్రియను” ప్రారంభోత్సవం చేసిన గౌరవ నర్సంపేట శాసనసభ్యులు శ్రీ. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు .

వర్షం ఎప్పుడు పడిన ఆ నీటిని ఒడిసి పట్టడానికి నెహ్రు యువ కేంద్రం & సంఘ మిత్ర యూత్ వారి ఆధ్వర్యంలో ఖానాపూర్ మండలం ధర్మారావుపేట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల నందు ఏర్పాటుచేసిన “వర్షపు నీటిని త్రాగు నీటిగా మార్చే నిర్మాణ ప్రక్రియను” నేడు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, వరంగల్ జిల్లా కలెక్టర్ బి. గోపి గార్ల చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…

– వ‌ర్ష‌పు నీటి చుక్కను భూగ‌ర్బంలో నిలువ‌ చేసుకునే హార్వెస్టింగ్ విధానంలో న‌ర్సంపేట రెవెన్యూ డివిజ‌న్ ముందు వ‌రుస‌లో ఉందన్నారు.
– తెలంగాణ రాష్ట్రంలో మొట్ట మొద‌టి సారిగా కొత్త ఆక్టివిటిని న‌ర్సంపేట నియోజ‌క వ‌ర్గంలోనే మ‌న డి.ఆర్‌.డి.వో సంప‌త్ రావు గారు సంఘ‌మిత్ర యూత్ ఆర్గ‌నైజేష‌న్ ని ముందుపెట్టి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఈ రోజు మ‌నం ప్రారంభించుకొవడం అనేది ఎంతో సంతోషించ‌ ద‌గ్గ విషయం అని mla తెలిపారు.
– ఈ సారి వ‌ర్ష‌పు నీటి చుక్క‌ను ప్ర‌త్యేకంగా ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే విధంగా, చిన్న పిల్ల‌ల ఆరోగ్యాన్ని దృష్ఠ‌లో పెట్టుకొని ఉచితంగా పూరిఫైడ్ వాట‌ర్‌ని తీసుకువ‌చ్చి అందించే విధంగా వాట‌ర్ హ‌ర్వెస్టింగ్ విధానాన్ని న‌ర్సంపేట నియోజ‌క వ‌ర్గంలో మొట్ట‌మొద‌టి సారిగా నిర్మించ‌డం జరిగింది.
– ఈ నిర్మాణాన్ని నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఏర్పాటు చేయడానికి సహకరిస్తానని ఎం ఎల్ ఏ అన్నారు.
– యువత ఎప్పుడు కూడా ఇలాంటి నూతన ఆవిష్కరణలకు ముందుకు రావాలని వారికి నా తోడ్పాటు ఎప్పుడు ఉంటుందని ఎమ్మెల్యే తెలియజేశారు.
– ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న టీం అంద‌రికి పేరు పేరున నా అభినంద‌న‌లు అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి గోపి మాట్లాడుతూ లక్ష రూపాయల వ్యయంతో వారి లక్ష్యాన్ని సాధించిన యువకులు మిత్ర యూత్ ఆర్గనైజేషన్ వారిని కలెక్టర్ అభినందించారు యువకులు కొత్త ఇన్నోవేటివ్ కార్యక్రమాలు చేయాలని దానికి తన తోడ్పాటు ఎప్పుడూ ఉంటుందని కలెక్టర్ తెలిపారు రు రు వర్షపు నీటిని ఒడిసి పట్టడం దానిని వినియోగంలోకి తేవడం ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాలపై ఆసక్తి కనబరుస్తున్నారని వరంగల్ జిల్లాలో అనంతరం ధర్మారావు పేట లో జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాల నందు వాన నీటిని త్రాగు నీటి గా మార్చి విద్యార్థులు కు ఉపయోగపడే విధంగా ఒక కొత్త ఆలోచన తో యువకులు ఇది సాధించడం చాలా గొప్ప విషయం అన్నారు నా యొక్క విద్య అభ్యాసం కూడా 12వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలోనే జరిగిందని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు క్రీడ మరియు యువజన సర్వీసుల శాఖ ద్వారా నెహ్రూ యువ కేంద్రం వారి ఆధ్వర్యంలో యువతను ప్రోత్సహించి ఇంత మంచి కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకు అధికారులను నిర్వాహకులను యూత్ కమిటీ వారిని కలెక్టర్ అభినందించారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ బి హరి సింగ్ ,డి ఆర్ డి ఓ సంపత్ రావు, ODCMS చైర్మన్ గారు, NYK జిల్లా అధికారి అన్వేష్, ఆర్డీవో పవన్ కుమార్, ఎంపిపి, జెడ్పిటిసి, వైస్ ఎంపిపి, ఎంపిటిసిలు, సర్పంచ్, ఇతర ప్రజాప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post