వర్షాలు, వరదల వలన ప్రజలను అప్రమత్తం చేయండి- రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్.

ఆగష్టు 30, 2021ఆదిలాబాదు:-

రాష్ట్రములో కురుస్తున్న వర్షాల వలన ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లాల కలెక్టర్ లను, ఎస్పీలను ఆదేశించారు. సోమవారం రోజున BRK భవన్ నుండి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇరిగేషన్, ఇతర అధికారులతో రాష్ట్రం లో కురుస్తున్న వర్షాలు, వరదల వలన తీసుకుంటున్న ముందస్తు చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో లోతట్టు ప్రాంతాలను గుర్తించామని, క్షేత్ర స్థాయిలో అధికారులను అప్రమత్తం చేయడం జరిగిందని, టెలీ కాన్ఫెరెన్ ద్వారా అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేస్తున్నామని తెలిపారు. రెవెన్యూ, పోలీస్ సహకారంతో వర్షాల వలన ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగాకుండా సహాయసహకారాలు అందిస్తున్నామని తెలిపారు. అధికారులను వారివారి క్షేత్రాల్లో ఉండేవిధంగా ఆదేశించడం జరిగిందని తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో టోల్ ఫ్రీ నంబర్ 1800-425-1939 ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు తెలిపేవిధంగా విస్తృత ప్రచారం చేస్తున్నామని, వచ్చిన సమస్యలకు వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. జిల్లాలో ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ, జిల్లాలో 37 ప్రాంతాలలో వర్షాల వలన రోడ్డు దెబ్బతిని రహదారి సౌకర్యం నాకు అంతరాయం కలుగుతుందని, పోలీస్ అధికారులతో ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాలను సందర్శించి ప్రజలను అప్రమత్తం చేయడం, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరుగకుండా పోలీస్ యంత్రాగం అప్రమత్తంగా ఉండే విధంగా ఏర్పాటు చేపట్టామని తెలిపారు. వరదల వలన అత్యవసర సేవలందించేందుకు పోలీస్ కంట్రోల్ రూమ్ లో హెల్ప్ లైన్ నంబర్ 8106674510 ఏర్పాటు చేశామని తెలిపారు. నీటిపారుదల శాఖ సూపెరింటెండింగ్ ఇంజనీరింగ్ పి.రాము మాట్లాడుతూ, జిల్లాలో సాత్నాల, మత్తడివాగు ప్రాజెక్టులలో సాధారణ నీటి మట్టం కన్నా ఒక మీటర్ తక్కువ ఉండేవిధంగా ఎప్పటికప్పుడు పరిశీలించి నీటిని కిందకి వదలడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని చెరువులలో నీరు పూర్తీ సామర్థ్యము తో నిండి ఉన్నాయని తెలిపారు. ప్రాజెక్టు గెట్ లను తెరిచే సమయంలో ఆయా పోలీస్, రెవెన్యూ అధికారులకు, ఆయా గ్రామాల ప్రజలకు ముందస్తు సమాచారం అందించడం జరుగుతుందని తెలిపారు. వరద ఉదృతి సమయంలో ప్రజలు ఎవరు కూడా నీటి ప్రాంతానికి వెళ్లకుండా ఉండాలని, ఆయా ప్రాంతాలలో ముందస్తుగా తెలియజేయడం జరుగుతున్నదని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఆర్డీఓ జాడి రాజేశ్వర్, మున్సిపల్ కమీషనర్ శైలజ, సిపిఒ వెంకటేశ్వర్లు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.నరేందర్ రాథోడ్, పంచాయితీ రాజ్ ఈఈ మహావీర్, జిల్లా పంచాయితీ అధికారి శ్రీనివాస్, ఇరిగేషన్ ఈఈ విట్టల్, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

…………………………………………………………….. జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.

Share This Post