వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల

బంగళఖాతంలో ఏర్పడిన గులాబ్ తూఫాన్ వల్ల సోమవారం నుండి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ నిఖిల కోరారు.

ఈరోజు ధారూర్ మండలంలోని దోర్నాల, మన్సాన్ పల్లి వాగులను అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్నందున ప్రజలను దెగ్గరికి రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. రాత్రి పూట అధికారులు అందరు అప్రమత్తంగా ఉండి ఏలాంటి అవాంఛనియ సంఘటనలు జరుగకుండ చూడాలని ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితిని ఎప్పటికప్పుడు
సమీక్షిస్తూ, అవసరమైన చర్యలను వెంటనే చేపట్టాలని స్థానిక అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

ఈ సందర్బంగా జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, ధారూర్ తహసీల్దార్ భీమయ్య ఎంపీడీఓ ఉమాదేవి, గ్రామ కార్యదర్శి శోభన తదితరులు పాల్గొన్నారు.

Share This Post