వసతిగృహాల మరమ్మతు పనులను నాణ్యతతో చేపట్టాలి…

ప్రచురణార్థం

వసతిగృహాల మరమ్మతు పనులను నాణ్యతతో చేపట్టాలి…

మహబూబాబాద్, డిసెంబర్ 3.

వసతి గృహాల మరమ్మతు పనులను నాణ్యతతో చేపట్టాలని రాష్ట్ర షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్ యోగితా రాణా ఆదేశించారు.

శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ షెడ్యూల్ కులాల బాలికలు బాలుర వసతి గృహాలను జిల్లా కలెక్టర్ శశాంక తో కలిసి పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వసతి గృహాలకు తప్పనిసరిగా మెస్ డోర్ లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

వసతిగృహాల లోపలి గోడలపై భారతదేశం తెలంగాణ రాష్ట్రం మ్యాపులను పెయింటింగ్ తో వేయించాలని అదేవిధంగా ఆచార్య జయశంకర్ చిత్ర పటంతో పాటుగా మదర్ తెరిసా చిత్రపటాన్ని వేయించాలన్నారు.

గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి విజ్ఞానాన్ని అందించే పుస్తకాలను అందుబాటులో ఉంచాలన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ షెడ్యూల్ కులాల జాయింట్ డైరెక్టర్ హనుమంతు నాయక్ జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
—————————-4
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post