వసతిగృహాల మరమ్మతు పనులు నాణ్యతతో చేపట్టాలి… జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్

ప్రచురణార్థం

మహబూబాబాద్ జూలై 15.

వసతిగృహాల మరమ్మతు పనులు నాణ్యతతో చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్ ఆదేశించారు.

గురువారం కలెక్టర్ మున్సిపల్ పరిధిలోని హస్తినాపురంలో గల సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతిగృహాన్ని సందర్శించే చేపడుతున్న పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

వసతి గృహ వార్డెన్ యాదాద్రి వివరిస్తూ వంటగది పై కోతులు దాడి చేస్తున్నందున వంటగది కి గ్రిల్స్ అవసరమని, బాలురు కూర్చుని భోజనం చేసేందుకు డైనింగ్ సదుపాయం, అదేవిధంగా బాత్రూమ్ డోర్లు, మరుగుదొడ్లు, పైపులైన్లు గదులలో విద్యుత్ స్విచ్ బోర్డ్స్ వంటి మరమ్మతు పనులు చేపట్టవలసి ఉన్నదని కలెక్టర్కు వివరించారు.

కలెక్టర్ హాస్టల్ గదులను వాటర్ ట్యాంక్ ను సోలార్ సిస్టం ను పరిశీలించారు. ఎస్సీ హాస్టల్ పైభాగాన నీరు నిల్వ ఉండకుండా చెత్తను ఎప్పటికప్పుడు తొలగిస్తూ అత్యవసరమైన పనులు మాత్రమే చేపట్టాలని అవి కూడా నాణ్యతా పరంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ డిడి దిలీప్ కుమార్ ఇంజనీరింగ్ అధికారి అరుణ్ కుమార్ జిల్లా సాంఘిక సంక్షేమ అభివృద్ధి అధికారి రావూరి రాజు వసతిగృహాల వార్డెన్స్ యాదాద్రి సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
————————————————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post