వసతిగృహాల మరమ్మత్తుల పనులను వేగవంతంగా పూర్తి చేయాలి…

వసతిగృహాల మరమ్మత్తుల పనులను వేగవంతంగా పూర్తి చేయాలి…

ప్రచురణార్థం

వసతిగృహాల మరమ్మత్తుల పనులను వేగవంతంగా పూర్తి చేయాలి…

మహబూబాబాద్ జనవరి- 5:

వసతి గృహాలలో మరమ్మత్తుల పనులను వేగవంతంగా చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

బుధవారం కలెక్టర్ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వసతిగృహాల మరమ్మతు పనులను హాస్టల్ వార్డెన్ ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వసతి గృహాలలో ప్రాధాన్యత గల పనులను త్వరితగతిన చేపట్టి పూర్తి చేయాలన్నారు. తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం వంటి పనులతో పాటు వసతి గృహాలకు పెయింటింగ్ వేయించాలని, బోర్డులు రాయించాలని, అదేవిధంగా ఐరన్ బోర్డు కూడా ఏర్పాటు చేయించాలన్నారు. ప్రతి బోర్డు పై మూడు భాషలలో వసతి గృహాల పేర్లు ఉండాలన్నారు.

మరమ్మత్తుల పేర్లతో నాణ్యత లేకుండా పనులు చేపట్టి నిధులు వృధా చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

ప్రతి వసతి గృహానికి తప్పనిసరిగా మిషన్ భగీరథ కనెక్షన్ ఉండి తీరాలన్నారు.  వసతి గృహాల తలుపులకు, కిటికీలకు మెస్ డోర్స్ బిగించాలన్నారు. ఈనెల 17వ తేదీ లోపు గా పనులు పూర్తి చేసి నివేదిక సమర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ఈ సమీక్ష సమావేశంలో సాంఘిక సంక్షేమ అధికారి బాలరాజు, ఇంజనీరింగ్ అధికారులు, వార్డెన్లు, తదితరులు పాల్గొన్నారు.
—————————————————————————————————————–
 జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post