ప్రచురణార్థం
మహబూబాబాద్, జూలై -30:
జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో అస్వస్థతకు గురైన సందర్భంగా రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, జిల్లా కలెక్టర్ కె. శశాంక వసతి గృహం సందర్శించి ఇచ్చిన ఆదేశాల మేరకు వసతి గృహంలో మెరుగైన ఏర్పాట్ల నిమిత్తం చర్యలు చేపట్టామని ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ ఎర్రయ్య నేడొక ప్రకటనలో తెలిపారు.
వసతి గృహంలో చర్యలు చేపట్టామని, ఇందులో భాగంగా నిర్లక్ష్యం వహించిన వార్డెన్ రోజ నీలను సస్పెండ్ చేయడం జరిగిందని, వంట వండే వారిని పక్కకు పెట్టడం జరిగిందని, క్రొత్త వారిని ఏర్పాటు చేయడం జరిగింది అని, నీటి వ్యవస్థలో గల లోపాలను సవరించుకోవడం, మరమ్మతులు చేపట్టి, శుద్ధమైన త్రాగు నీరు, వంటకు శుద్ధమైన నీటిని వాడే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. వసతి గృహంలో సివిల్ పనులు చేపట్టామని తహశీల్దార్, తను ప్రత్యేక అధికారులుగా వ్యవహరిస్తూ మొత్తం శానిటేషన్, హెల్త్ క్యాంప్ లు ఏర్పాటు చేసి పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకున్నామని, పారిశుధ్యం లోపించకుండ పాఠశాల, వసతి ఆవరణలో పరిశుభ్రంగా, టాయ్లెట్ లు శుభ్రం గా ఉండే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు.
ఇకముందు ఇటువంటి తప్పిదాలు, పొరపాట్లు పునరావృతం కాకుండా అన్ని చర్యలు చేపట్టామని ఎర్రయ్య ఆ ప్రకటనలో తెలిపారు.