వసతి గృహల్లోని విద్యార్థులకు మెరుగైన విద్యా, నాణ్యమైన భోజనం, మౌలిక వసతులు కల్పించాలి:: జిల్లా కలెక్టర్ జి.రవి

ప్రచురణార్థం—-1

తేదీ.4.1.2022

వసతి గృహల్లోని విద్యార్థులకు మెరుగైన విద్యా, నాణ్యమైన భోజనం, మౌలిక వసతులు కల్పించాలి:: జిల్లా కలెక్టర్ జి.రవి


జగిత్యాల జనవరి 04:- జిల్లాలో వసతి గృహల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యా, నాణ్యమైన భోజనం, మౌలిక వసతులు కల్పించాలని,సకాలంలో విద్యార్థులు స్కాలర్షిప్ దరఖాస్తులు సమర్పించే దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి . రవి సంబంధిత అధికారులను ఆదేశించారు. పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ లు, ప్రభుత్వ వసతి గృహాల నిర్వహణ సంబంధిత అంశాలపై కలెక్టర్ మంగళవారం స్థానిక ఐఎంఏ హాల్ లో సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు.

జగిత్యాల జిల్లాలో 16 బిసి , 19 ఎస్సీ, 6 ఎస్టీ ప్రిమెట్రిక్ హాస్టల్స్ ఉన్నాయని, వీటిలో 1669 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని అధికారులు తెలిపారు. జిల్లాలో 6625 ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తులు (5 నుంచి 10వ తరగతి) సమర్పించాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం 363 మాత్రమే రిజిస్టర్ కావడంపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు జీరో బ్యాంక్ ఖాతాలు అందడం లేదని, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల సమస్యల వల్ల దరఖాస్తు సమర్పించుట ఆలస్యం అవుతుందని అధికారులు వివరించారు. జిల్లాలో బ్యాంకు ఖాతాలు లేని విద్యార్థులు, కుల ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అవసరం ఉన్న విద్యార్థుల జాబితా పాఠశాల వారిగా తయారు చేయాలని, వసతి గృహంలోని అన్ని అంశాల్లో పురోగతి ఉండాలని, లేని యెడల సంబంధిత వార్డెన్ల పై తగు చర్యలు తీసుకోబడును కలెక్టర్ ఆదేశించారు.

విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి నివేదిక అందజేయాలని పేర్కొన్నారు. విద్యార్థులకు అవసరమైన కుల ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సమీపంలో ఉన్న మీ సేవ కేంద్రాల ద్వారా త్వరితగతిన అందేలా తహశీల్దార్లకు ఆదేశాలు జారీ చేస్తామని కలెక్టర్ తెలిపారు. సకాలంలో ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తులు పూర్తిస్థాయిలో సమర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

జిల్లాలో జూనియర్ మరియు డిగ్రీ కళాశాల విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ రెన్యూవల్ దరఖాస్తులు 2786 చేసుకోవాల్సి ఉండగా ఇప్పటి వరకు 2204 రిజిస్టర్ అయ్యాయని, 582పెండింగ్లో ఉన్నాయని అధికారులు తెలిపారు. జిల్లాలో 2925 ఫ్రెష్ పోస్ట్ మెట్రిక్ దరఖాస్తులు వచ్చాయని అధికారులు వివరించారు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ రెన్యువల్ రిజిస్ట్రేషన్ జనవరి 12 వరకు, ఫ్రెష్ రిజీస్ట్రేషన్ జనవరి 31 వరకు పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

అనంతరం జిల్లాలో ఉన్న వసతి గృహాల నిర్వహణ పై కలెక్టర్ రివ్యూ నిర్వహించారు. హాస్టల్స్ లో పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. విద్యార్థులకు అందించే ఆహారం తదితర అంశాల్లో జాగ్రత్త వహిస్తూ మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

హాస్టల్స్ లో ఉన్న చిన్న చిన్న మరమ్మతులకు సంబంధించి వివరాలతో నివేదిక సమర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. బాత్ రూం, డైనింగ్ ఏరియా, పడక గదులు, త్రాగునీటి సౌకర్యం మొదలైన అంశాలపై హాస్టల్ వారీగా నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని, విద్యార్థులంతా తప్పనిసరిగా కరోనా జాగ్రత్తలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని ప్రతి హాస్టల్ ను ప్రత్యేక అధికారులు సందర్శించాలని కలెక్టర్ సూచించారు.

10వ తరగతి పరీక్షల నేపథ్యంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఉన్న హస్టల్స్ లో ఉంటున్న ప్రతి విద్యార్థి వద్ద తప్పనిసరిగా స్వెట్టర్, బ్లాంకెట్ ఉండాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో హాస్టల్స్ లో స్వెటర్, బ్లాంకెట్ లేని విధ్యార్థుల జాబితా తయారు చేయాలని, 2 రోజులో వారికి స్వెటర్, బ్లాంకెట్లను అందుబాటులో ఉన్న నిధుల నుండి అందించే విధంగా చర్యలు తీసుకుంటానని కలెక్టర్ తెలియచేసారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి జగిత్యాల చే జారి చేయబడినది.

Share This Post