వసతి గృహాలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలి…

ప్రచురణార్థం

వసతి గృహాలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలి…

మహబూబాబాద్ నవంబర్ 18.

వసతి గృహాలను అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

గురువారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలోని వసతిగృహాల పనితీరును సంబంధిత సంక్షేమ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని వసతిగృహాలలో మౌలిక వసతుల కల్పనకు తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు.

విద్యార్థులు ఉదయమే లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రించే వరకూ వారికి కావలసిన సదుపాయాలు అన్నీ సమకూర్చాలి అన్నారు.

వసతి గృహాలకు నిరంతర నీటి సరఫరా కొరకు మిషన్ భగీరథ కనెక్షన్ పొందాలన్నారు.

విద్యుత్ సరఫరా పరిశీలించాలని మరమ్మతులు ఉంటే చేయించాలన్నారు అదేవిధంగా శీతాకాలం కావడంతో విద్యార్థులు ఇబ్బంది పడకుండా భవనాల ద్వారాలకు కిటికీలకు తలుపులు ఏర్పాటు చేయించాలన్నారు.
మరుగుదొడ్ల లోపాలు సవరించాలని నిర్వహణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.
వసతిగృహాల అధికారులు సిబ్బంది స్థానికంగా ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
విద్యార్థుల నమోదుకు తగినట్టుగా హాజరు ఉండి తీరాలన్నారు పదవ తరగతి విద్యార్థులకు షూటర్లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు విద్యార్థుల ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలని వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు.
విద్యార్థుల పౌష్టికాహారం కొరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెనూ ప్రకారం గా ఏజెన్సీలు సరఫరా చేస్తున్నాయా లేదా పర్యవేక్షించాలని అన్నారు.

ఈ సమీక్ష సమావేశంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి దిలీప్ కుమార్ సాంఘిక సంక్షేమ శాఖ రీజినల్ కోఆర్డినేటర్ రాజ్యలక్ష్మి పి పి గిరిజన సంక్షేమ శాఖ రీజినల్ కోఆర్డినేటర్ ప్రత్యూష జ్యోతిరావు పూలే రీజనల్ కోఆర్డినేటర్ మనోహర్రెడ్డి షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి బాలరాజు వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి నరసింహ స్వామి తదితరులు పాల్గొన్నారు
———————————————————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post