వసతి గృహాలను తనిఖీ చేసి నాణ్యమైన భోజనం, మెరుగైన వసతులు కల్పించుటకు చర్యలు తీసుకోవాలి …. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

వసతి గృహాలను తనిఖీ చేసి నాణ్యమైన భోజనం, మెరుగైన వసతులు కల్పించుటకు చర్యలు తీసుకోవాలి …. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

ప్రచురణార్థం

ప్రతి హాస్టల్ కు ప్రత్యేక అధికారి కేటాయించి ప్రత్యేక అధికారులతో వసతి గృహాలపై సమీక్షించిన జిల్లా కలెక్టర్

మహబూబాబాద్, జూలై -30:

వసతి గృహాలను తనిఖీ చేసి నాణ్యమైన భోజనం, మెరుగైన వసతులు కల్పించుటకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక ప్రత్యేక అధికారులను ఆదేశించారు.

శనివారం కలక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె. శశాంక జిల్లాలోని వసతి గృహాలలో పరిశుభ్రత, నాణ్యమైన భోజనం అందించుట, వసతులు పరిశీలన పైప్రత్యేక అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి సమీక్షించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, వసతి గృహాలను తనిఖీలు చేస్తున్న, పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోమని చెపుతున్న పూర్తి స్థాయిలో ఫలితాలు రావడం లేదని, ఇట్టి పరిస్థితిని దాటి ముందుకు వెళ్లాలని, భవిష్యత్తులో ఇకముందు ఎటువంటి సమస్యలు రాకుండా పకడ్బందీగా తనిఖీలు చేసి వసతి గృహంలో మెరుగైన వసతులు, నాణ్యమైన భోజనం పిల్లలకు అందేలా చర్యలు తీసుకొనేందుకు ప్రతి హాస్టల్ ను తనిఖీ చేయాలనీ, ఇందుకు గాను ప్రతి హాస్టల్ కు ఒక ప్రత్యేక అధికారిని కేటాయించడం జరిగిందని, రానున్న మూడు,నాలుగు రోజుల్లో తనిఖీలు చేసి చెక్ లిస్ట్ ప్రకారం వివరాలు నమోదు చేసి సమర్పించాలని తెలిపారు.

తనిఖీ చేసిన సందర్భంలో వసతి గృహంలో ఉన్న వంట మనిషి, కామాటి, సిబ్బంది అనుభవం, వారు వండుతున్న సమయంలో తీసుకుంటున్న జాగ్రత్తలను పరిశీలించాలని, వంటకు మిషన్ భగీరథ నీటిని వాడే విధంగా చూడాలని, బావి నీరు వాడకుండా చూడాలని, శానిటేషన్ పాటించే విధంగా చూడాలని, చెత్తను ఎప్పటికప్పుడు బయటకు పంపాలని, వసతి గృహంలో వెంటనే మార్పు చేయవలసిన వాటి వివరాలు తెలపాలని, పిల్లలతో మాట్లాడి సమస్యలు తెలుసుకోవాలని, స్టోర్ రూం లను పరిశీలించాలని, నాణ్యమైన వస్తువులను, తాజా కూరగాయలను వాడే విధంగా చూడాలని తెలిపారు. టాయిలెట్ లు ప్రతిరోజు శుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, కష్టపడుతున్న సందర్భంలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉండాలని, లోపాలు లేకుండా చూడాలని తెలిపారు.

వార్డెన్, సిబ్బంది స్థానికంగా హాస్టల్ లో ఉండి సమయానికి భోజనం అందించాలని, తనిఖీ సమయంలో భోజనం చేసి నాణ్యమైన, రుచికరమైన భోజనం అందేలా చూడాలనీ తెలిపారు. పెయింటెడ్ మెను ప్రదర్శించి దాని ప్రకారం వండి వడ్డించే విధంగా చూడాలని తెలిపారు. మెష్ లు ఉండే విధంగా చూడాలని తెలిపారు. తనిఖీ పకడ్బందీగా చేసి భవిష్యత్తులో పిల్లలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, ఆర్డీవో లు కొమురయ్య, ఎల్. రమేష్, జెడ్పీ సి. ఈ. ఓ. రమాదేవి, డి.సి.ఎస్. ఓ., డి.ఎం. – సివిల్ సప్లైస్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్, డి.సి.హెచ్.ఎస్. సూర్యనారాయణ, డి.పి. ఓ. సాయి బాబా, మిషన్ భగీరథ ఇంట్రా, గ్రిడ్ ఈ.ఈ.లు, డి. ఈ. ఓ. ఎం.డి. అబ్దుల్ హై, డి.ఎస్.సి.డి. ఓ., డి.బి.సి.డి. ఓ., డి.టి.డి. ఓ. ఎర్రయ్య, డి.ఎం.డబ్ల్యూ.ఓ., డి. డబ్ల్యూ. ఓ. నర్మద, ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్
ఆర్.సి. ఓ.లు, సంభందిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post