వసతి గృహాలలో ఉన్న విద్యార్థులు పరీక్షలు రాయడానికి సిద్దంగా ఉండేలా చూడాలి : విద్యార్థులకు ఏమైనా ఆందోళనలు ఉన్నట్లైతే ట్రోల్ ఫ్రీ నెంబర్ 1800-5999333 కు ఫోన్ చేసి నివృత్తి చేయించాలి: అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్

వసతి గృహాలలో ఉన్న విద్యార్థులు పరీక్షలు రాయడానికి సిద్దంగా ఉండేలా చూడాలి

విద్యార్థులకు ఏమైనా ఆందోళనలు ఉన్నట్లైతే ట్రోల్ ఫ్రీ నెంబర్ 1800-5999333 కు ఫోన్ చేసి నివృత్తి చేయించాలి

అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్

00000000

పదవ తరగతి చదివే రెసిడెన్షియల్ స్కూల్స్, వసతి గృహాల విద్యార్థులను పరీక్షలు రాయడానికి సిద్దంగా ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు.

గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పదవ తరగతి పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హాస్టల్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. గత 5 సంవత్సరాల వార్షిక పరీక్షలలో వచ్చిన ముఖ్యమైన ప్రశ్నలను విద్యార్థులకు తెలియజేసి పరీక్షలలో ఉన్నతమైన ఫలితాలను సాధించే విధంగా కృషి చేయాలని సూచించారు. పరిక్ష రాసే విద్యార్థుల కోసం టోల్ ఫ్రీ కంట్రోల్ రూం ఏర్పాటు చేయడం జరిగిందని, ఆందోళన చెందే విద్యార్థులతో 1800-5999333 నెంబర్ కు మాట్లాడించి వారి సందేహాలను నివృత్తి చేయించాలని అధికారులను ఆదేశించారు. పరీక్ష సెంటర్ల వద్ద విద్యార్థులకు నెంబర్ తెలిసే విధంగా నోటిస్ బోర్డులపై టోల్ ఫ్రీ నెంబర్ ఉంచాలని ఆధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద నిరంతరం విద్యుత్ సరఫరా ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు పరీక్ష రాసే గదిలో త్రాగునీటిని అందించాలని, అవసరమైన మౌళిక వసతులు కల్పించాలని అధికారులను ఆమె ఆదేశించారు. పరీక్ష కేంద్రంలో ప్రశ్నా పత్రం తెరిచే గదిలో సి.సి. కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్ష సెంటర్ల వద్ద మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి ఏఎన్ఎంలు, అశా వర్కర్లు ఓ.ఆర్.ఎస్. ప్యాకెట్లతో అందుబాటులో ఉండాలని సూచించారు. పరీక్ష రాసే ముందు విద్యార్థులు ఎవరైనా ఆందోళనకు గురైతే అలాంటి విద్యార్థులకు ధైర్యం కలిగించే విధంగా చూడాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి జనార్ధన్ రావు, వెనకబడిన తరగతుల అభివృద్ది అధికారి రాజమనోహర్ రావు, మైనార్టి అధికారి మధుసుధన్, షెడ్యుల్డ్ కులాల అభివృద్ది అధికారి నతానియేలు, వసతి గృహాల ప్రిన్సిపాల్స్, జిల్లా కో-ఆర్డినేటర్లు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post