వసతి గృహాలలో సౌకర్యాలు పకడ్బందీగా ఏర్పాటు చేయాలి …. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

వసతి గృహాలలో సౌకర్యాలు పకడ్బందీగా ఏర్పాటు చేయాలి …. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

వసతి గృహాలలో సౌకర్యాలు పకడ్బందీగా ఏర్పాటు చేయాలి …. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

తొర్రూరు,
మహబూబాబాద్ జిల్లా, జూన్ -06:

వసతి గృహాల్లో సౌకర్యాలు పకడ్బందీగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక సంబంధిత అధికారులను ఆదేశించారు.

సోమవారం జిల్లా కలెక్టర్ కె శశాంక తో తొర్రూరు పట్టణంలో పర్యటించి సమీకృత సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం లో ఏర్పాటు చేసిన మోడల్ కిచెన్ గార్డెన్, మోడల్ కిచెన్, డైనింగ్ హాల్, పిల్లల వసతిని పరిశీలించారు.

సమీకృత సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో కల్పించిన సౌకర్యాల మాదిరిగా జిల్లాలోని మిగతా హాస్టల్ లలో ఏర్పాటు చేయుటకు గాను అధికారులను ఆదేశించారు. అన్ని హంగులు కల్పించి ఆకర్షనీయంగా, ఆదర్శ ప్రాయంగా హాస్టల్ లను తీర్చిదిద్దాలని తెలిపారు. ఇంకా చేయవలసిన పనులను జూన్-15 లోగా పూర్తి చేయాలని, సోలార్ సిస్టం ద్వారా హాట్ వాటర్ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని, హాస్టల్స్ లోని టాయ్లెట్ లో నంబరింగ్ ఏర్పాటు చేయాలని, పెద్ద సైజులో మిర్రర్ ఏర్పాటు చేయాలని తెలిపారు. అన్ని సౌకర్యాలు కల్పించి ఆకర్షనీయంగా తయారు చేసిన వాటిలొ పిల్లలు అత్యధికంగా నమోదు అయ్యె విధంగా తల్లిదండ్రులను, గ్రామ సర్పంచులను పిలిచి హాస్టల్ ప్రత్యేకతలు చూపించి పిల్లలు ఎక్కువగా నమోదు అయ్యె విధంగా చూడాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డి.ఆర్. డి.ఓ. సన్యాసయ్య, డి.ఇ. నరేందర్ రెడ్డి, రవీందర్, ఆర్డిఓ రమేశ్, మునిసిపల్ కమీషనర్ గుండే బాబు, తహసిల్దార్ రాఘవ రెడ్డి, మునిసిపల్ ఎ.ఇ. రంజిత్, వార్డెన్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Share This Post