వసతి గృహాల్లో ఎన్రోల్మెంట్ పెంచాలి ….. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

వసతి గృహాల్లో ఎన్రోల్మెంట్ పెంచాలి ….. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

ప్రచురణార్థం

మహబూబాబాద్, ఆగస్ట్ -16:

వసతి గృహాల్లో ఎన్రోల్మెంట్ పెంచాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక తెలిపారు.

మంగళవారం కలక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె. శశాంక స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి
షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ వసతి గృహాలపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి సమీక్షించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, వసతి గృహంలో పిల్లల నమోదు ఎక్కువగా ఉండాలని, వసతి గృహంలో సకల సౌకర్యాలు ఉన్నాయని పిల్లల తల్లిదండ్రులకు నమ్మకం కల్పించాలని, తక్కువ ఉన్న చోట ఎన్రోల్మెంట్ పెంచాలని, కొన్ని వసతి గృహాల్లో 50 శాతం కూడా హాజరు నమోదు కావడం లేదని తెలిపారు. భోజనం, వసతి, చదువుతున్న వాటిపై కల్పించిన సౌకర్యాలపై అంశాల వారీగా పరిశీలన చేసి హాస్టల్స్ కు ర్యాంకింగ్ ఇవ్వాలని తెలిపారు. ఎం.పి.డి. ఓ., తహశీల్దార్ లతో, స్థానిక సంస్థల ప్రతినిధులతో సమన్వయం చేసుకొని సమావేశం ఏర్పాటు చేసి ఎన్రోల్మెంట్ పెంచాలన్నారు. మహబూబాబాద్ లోని బాలికల, బాలుర హాస్టల్ లో తక్కువ ఎన్రోల్మెంట్ నమోదు ఉన్నదని, పెంచాలని తెలిపారు.

వారం రోజుల్లోగా హాస్టల్ లలో బయో మెట్రిక్ అమలు చేయాలని, బయో మెట్రిక్ పాడైతే, పగలకొట్టిన సందర్భంలో వార్డెన్ నుండి రికవరీ చేయబడుతుంది అని తెలిపారు.

మెస్, శానిటేషన్, అకడమిక్ కమిటీ లు ఏర్పాటు చేయాలనీ తెలిపారు.డోర్నకల్, తొర్రూరు, మహబూబాబాద్ లో ఖర్చు పెట్టీ చేసిన తలుపులు, కిటికీలు, ఇతర వస్తువులను డ్యామేజ్ కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపారు.

ఎన్రోల్మెంట్ పెంచుటకు గాను రవాణ సౌకర్యం ఇబ్బంది ఉన్నట్లైతే వారికి సైకిల్ లు అందించుటకు దాతల ద్వారా అందించుటకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

265 మందికి గాను 258 మంది పరీక్ష రాశారని, 232 మంది పదవ తరగతి పాస్ అయ్యారని, మిగతా వారు గైర్హాజరు కావటానికి గల కారణాలు ఏమిటని అడిగి తెలుసుకున్నారు.

ఈ సంవత్సరం పదవ తరగతి విద్యార్ధులకు కార్యక్రమం ఏర్పాటు చేసి గత సంవత్సరం పదవ తరగతి 9 జి.పి. ఏ. వచ్చిన వారిని ఆ కార్యక్రమంలో సన్మానించాలని తెలిపారు.

సెప్టెంబర్, అక్టోబర్ లో మోటివేషన్ తరగతులు నిర్వహించాలని, గ్రూప్ లు చేసి స్లో లెర్నర్స్ ను గుర్తించి ఏ సబ్జెక్ట్ లో వెనకబడి ఉన్నారో తెలుసుకొని వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని తెలిపారు.

హాస్టల్ వార్డెన్ లకు పదవ తరగతి విద్యార్థుల పరీక్ష ఫలితాలతో ర్యాంకింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డి.ఎస్.సి.డి. ఓ. సన్యాసయ్య, ఏ.ఎస్. డబ్ల్యూ.ఓ., హెచ్.డబ్ల్యూ. ఓ.లు, సీనియర్ అసిస్టెంట్ పూర్ణచందర్, తదితరులు పాల్గొన్నారు.

Share This Post