వసతి గృహాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి

వసతిగృహాల్లో ని విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదవాలి

స్మార్ట్ ఫోన్ కు దూరంగా ఉండాలి

విద్యార్థుల కోసం లైబ్రరీ ఏర్పాటు చేయాలి

ప్రతిరోజు దిన పత్రికలు వచ్చేలా చూడాలి

వసతిగృహాల్లో ని టాయిలెట్స్ బాత్రూమ్స్ పరిశుభ్రంగా ఉండేలా చూడాలి

రాష్ట్ర షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్ యోగితా రాణా

000000

     ఎస్సీ వసతి గృహాల్లో అదనపు సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని ఆ నిధులను వెచ్చించి వసతి గృహాల్లో నాణ్యమైన సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్ యోగితా రాణా అధికారులను ఆదేశించారు.

గురువారం సాయంత్రం కరీంనగర్ రామ్ నగర్ లోని షెడ్యూల్ కులాల బాలుర కళాశాల వసతి గృహాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలో అదనంగా ఏర్పాటుచేసిన సౌకర్యాలను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిధులతో చేపట్టిన టాయిలెట్స్, బాత్రూమ్స్ మరమ్మతు పనులను ఆమె పరిశీలించారు. వసతి గృహం కారిడార్ లో ట్యూబ్ లైట్లు ఫ్యాన్ లను ఏర్పాటు చేయాలన్నారు. వసతి గృహంలో నాణ్యమైన కరెంట్ వైరింగ్ చేపట్టాలన్నారు. వసతి గృహంలో ఎన్ని వైర్లు మార్చారు అని అడిగి తెలుసుకున్నారు. గృహంలోని విద్యార్థుల గ్రూప్ పరీక్షలు రాసేందుకు లైబ్రరీ ఏర్పాటు చేయాలని,అందులో దినపత్రికలు తెప్పించాలని అన్నారు. అందరం వసతి గృహంలో ఉన్న విద్యార్థులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ వసతి గృహంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయా ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా అని, జీవితంలో రాణించాలంటే ఇష్టంతో బాగా చదవాలని, స్మార్ట్ ఫోన్ వాట్సాప్ ఫేస్బుక్ లకు దూరంగా ఉండాలని, ప్రతిరోజూ దినపత్రికలు చదవాలని అన్నారు. ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతిరోజు ఎక్సర్సైజ్ లు, జిమ్ లో చేయాలన్నారు. వసతి గృహం ఆవరణలో పండ్ల మొక్కలను నాటాలని విద్యార్థులను కోరారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలని హాస్టల్ వార్డెన్ ను ఆదేశించారు

     ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎస్సీ అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు నేతినీయల్, ఏ ఎస్ డబ్ల్యూ ఎండి హమీద్, ఏ ఈ ధనుంజయ్, హాస్టల్ వార్డెన్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post