వసతి గృహాల పనుల నాణ్యతపై దృష్టి పెట్టాలి …

ప్రచురణార్థం

వసతి గృహాల పనుల నాణ్యతపై దృష్టి పెట్టాలి …

మహబూబాబాద్ డిసెంబర్ 7.

వసతిగృహాలలో చేపట్టే పనులలో నాణ్యత ఉండడంలేదని అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

మంగళవారం కలెక్టర్ కార్యాలయ ప్రజ్ఞ వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో బీసీ ఎస్సీ ఎస్టి మైనారిటీ వసతిగృహాలలో వసతుల కల్పన పై వసతి గృహాల అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతోనూ అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వసతి గృహాలలో మరమ్మత్తులకై చేపడుతున్న పనులలో నాణ్యత ఉండడంలేదని తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. సంబంధిత వసతిగృహాల ఆర్ సి ఓ అధికారులు ఇంజనీరింగ్ అధికారులతో ప్రతి వారం పర్యవేక్షిస్తూ వసతిగృహాల పనితీరు పై నివేదిక ఇవ్వాలన్నారు.

వృధా సామాగ్రిని గదులలో ఉంచరాదని పని చేసే సామాగ్రి ఉంచినట్లయితే వాటి వివరాలను రికార్డులో నమోదు చేయాలన్నారు.

త్రాగునీరు శానిటేషన్ ఎలక్ట్రికల్ వర్క్స్ వంటి పనులను నాణ్యతతో ఉండేవిధంగా చూసుకోవాలన్నారు.

వసతి గృహాలకు ప్రాధాన్యతగా ప్రతి గదులకు కిటికీ లకు తప్పనిసరిగా మెస్ డోర్ లు ఏర్పాటు చేయించాలన్నారు పనులు జరిగినట్లుగా వాట్సాప్ ద్వారా ఫోటోలు పంపించాలన్నారు.

మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచాలని ప్రతి గదులలో లైట్స్ ఫ్యాన్స్ తప్పనిసరిట్గా పనిచేస్తూ ఉండాలన్నారు.

వసతిగృహాల గోడలను రంగులతో శుభ్రపరచాలి అని వాటిపై సాంకేతిక పరిజ్ఞానం అందించే బొమ్మలను వేయించాలన్నారు.

ఈ సమీక్ష సమావేశంలో ఇంజనీరింగ్ అధికారులు వసతిగృహాల రీజినల్ కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.
————————————————————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post