వాక్సినేషన్ ప్రక్రియ నూరు శాతం పూర్తి చేయుటకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.

సోమవారం క్యాంపు కార్యాలయం నుండి నూరు శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తిచేయుటపై రెవిన్యూ, వైద్య, డిపిఓ, మున్సిపల్ కమిషనర్లు, యంపిడిఓ, యంపిఓ, గ్రామపంచాయతీ కార్యదర్శులతో టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు. జిల్లాలో వ్యాక్సినేషన్ చేయించుకోవాల్సిన అర్హులైన లబ్దిదారులు 767978 మంది ఉన్నారని, వీరిలో మొదటి డోస్ వేయించుకున్న వారు 507117 మంది, రెండవ డోస్ తీసుకున్నవారు 149027 మంది ఉన్నారని, మొదటి, రెండవ తీసుకున్న వారుమొత్తం 656144 కాగా ఇంకనూ 2,60,000 వేల మందికి వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉన్నదని చెప్పారు. మిగిలిన వారందరూ వ్యాక్సిన్ తీసుకునే విధంగా గ్రామాల్లో, పట్టణాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. వ్యవసాయ పనులకు ప్రజలు వెళ్తుంన్నందున ఉదయం సాయంత్రపు సమయాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహించాలని చెప్పారు. జిల్లాలోని 38 ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతున్నదని, వ్యాక్సిన్ సమృద్ధిగా ఉన్నదని వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు ముందుకు రావాలని ఆయన సూచించారు. పంగుగల సీజన్ అయినందున ప్రజలు పెద్ద ఎత్తున జమకావడం జరుగుతుందని, రద్దీ వల్ల వ్యాధి వ్యాప్తి జరిగేందుకు అవకాశం ఉన్నందున ఈ నాలుగు రోజుల వ్యవధిలో నిర్దేశించిన లక్ష్యం పూర్తి | చేయాలని చెప్పారు. మండలస్థాయిలో వ్యాక్సినేషన్ ప్రక్రియను తహసిల్దార్ పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. – వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మాత్రమే కరోనా వ్యాధి సమూల నిర్మూలన చేయగలమని, మత పెద్దలు ప్రార్ధనా సమయాల్లో ప్రజలకు తెలియచేయాలని చెప్పారు. వ్యాక్సినేషన్ ప్రక్రియకు ప్రత్యేక క్యాంపులు కూడా ఏర్పాటు చేసి వ్యాక్సిన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రతి రోజు 30 వేల వరకు వ్యాక్సిన్ ప్రక్రియ జరగాలని ఆయన స్పష్టం చేశారు. వాక్సిన్ ప్రక్రియలో ప్రతి ఆవాసం కవరయ్యే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పారు. వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తుల వివరాలు తప్పని సరిగా ఆన్లైన్ చేయాలని చెప్పారు. ఆన్లైన్ ప్రక్రియ నిర్వహణకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ఈ టెలి కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ శిరీష, ప్రోగ్రాం అధికారి డాక్టర్ నాగేంద్రప్రసాద్, డిపిఓ రమాకాంత్, జడ్బీ సిఈఓ విద్యాలత, డిఆర్డిఓ మధుసూదనాజు, అన్ని మండలాల తహసిల్దార్లు, వైద్యాధికారులు, యంపిటలు, యంపిడిఓలు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post