వాక్సినేషన్ లక్ష్యాన్ని నాలుగు రోజులలో వంద శాంతం పూర్తి చేయాలి… కలెక్టర్ నిఖిల

ఇంటింటి సర్వే నిర్వహించి, వాక్సినేషన్ చేసుకొని వారిని గుర్తించి ప్రతి ఒక్కరికి వాక్సినేషన్ చేయాలని జిల్లా కలెక్టర్ నిఖిల వైద్య అధికారులను ఆదేశించారు.

ఈరోజు కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో వైద్య అధికారులు, తహసీల్దార్లతో వాక్సినేషన్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, బి ఎల్ ఓ. లు,
వి ఆర్ ఏ లు, అంగన్వాడీలు, సూపర్వైజర్ లతో ఒక టీమ్ గా ఏర్పడి ఇంటింటికి వెళ్లి నాలుగు రోజులలో వాక్సినేషన్ లక్ష్యం వంద శాంతం పూర్తి చేయాలని ఆదేశించారు. తహసీల్దార్ల సహకారంతో వైద్య అధికారులు ప్రతి రోజు ఎక్కువ మందికి వాక్సినేషన్ చేసి పని పూర్తి చేయాలని సూచించారు. ఇట్టి పనిలో మినహాయింపులు ఏమీ ఉండవని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఈ సందర్బంగా వైద్య అధికారులను కలెక్టర్ హెచ్చరించారు. టీమ్ సభ్యులు వాహనాలు సమకూర్చుకొని ప్రతి గడపకు వెళ్లి వాక్సినేషన్ చేయించుకొని వారిని గుర్తించి లక్ష్యం పూర్తి చేయాలని సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్, చంద్రయ్య, జిల్లా వైద్య అధికారి తుకారం, వికారాబాద్ తాండూర్ ఆర్ డి ఓ లు ఉపేందర్ రెడ్డి, అశోక్ కుమార్, వైద్య అధికారులు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post