వాక్సినేషన్ లో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలని రాష్ట్ర ,వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశించారు.

శనివారం నాడు వ్యాక్సినేషన్, మెడికల్ కళాశాలల పై హైదరాబాద్ సెక్రటరియేట్
నుండి రాష్ట్ర ఆర్ధిక, వైద్య శాఖ‌ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నిజిల్లా ల కలెక్టర్ లతో,వైద్య శాఖల అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి
కేసీఆర్ వైద్య రంగాన్ని మరింత పటిష్టం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు.
వైద్య సేవలో జవాబుదారితనం పెంచాలన్నారు. వైద్యశాలను నిరంతరం తనిఖీ చేయాలని వైద్య సిబ్బంది నియామక అధికారాలను కలెక్టర్లకు అప్పగించామన్నారు. ప్రజల్లో ప్రభుత్వం వైద్యం పట్ల నమ్మకాన్ని పెంచాలని మంత్రి సూచించారు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు 10 వేల కోట్లు ఆరోగ్యం కొరకు కేటాయించినట్లు తెలియజేశారు. తెలంగాణ డయాగ్నస్టిక్ సేవలను ప్రజలకు చేరే విధంగా వైద్యాధికారులు శాంపిల్స్ లక్ష్యాలను పెంచాలన్నారు.
హాస్పిటల్లో సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయని సర్జరీలు చేపట్టాలన్నారు. ఓ పి పెరగాలని తెలియజేశారు .శానిటేషన్ ప్రధానమని మెరుగు పరిచే విధంగా అధికారులు కృషి చేయాలన్నారు వైద్య అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని ఆస్పత్రులలో అందించే భోజనాల నాణ్యతను కూడా పరిశీలించాలన్నారు అదేవిధంగా బాత్రూం లు మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. వైద్యశాల పనితీరుపై రోగులతో మాట్లాడాలని అధికారులకు సూచించారు మలేరియా టిబి లెప్రసి బ్లైండ్నెస్ వంటి నాలుగు అంశాలపై నిరంతరం దృష్టి పెట్టాలన్నారు ఆర్ బి హెచ్ కె వాహనాలు వినియోగించుకొని వైద్య సేవలను అందించాలన్నారు .జిల్లాల లో తాను ఆకస్మికంగా పర్యటిస్తానని తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలక్టరేట్ కార్యలయం నుంచి రాజీవ్ గాంధీ హనుమంతు, డియం అండ్ హెచ్ వో లలితాదేవి ,డిపోవో జగదీశ్వర్, వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు .

Share This Post