వాక్సినేషన్ లో వేగం పెంచి, రెండవ డోసు కు ప్రణాళిక సిద్దం చేయాలి అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అబ్దుల్ హమీద్

ప్రచురణార్థం-2
జనగామ, డిసెంబర్ 6: పట్టణంలోని మిగిలిన వాక్సినేషన్ త్వరగా పూర్తి చేసి రెండవ డోసుకు ప్రణాళిక సిద్దం చేయాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అబ్దుల్ హమీద్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వాక్సినేషన్ పై వార్డు స్పెషల్ ఆఫీసర్స్, అంగన్ వాడీ, ఆశ వర్కర్లు, వైద్య సిబ్బంది, మునిసిపల్ సిబ్బంది తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణoలో వాక్సినేషన్ వెంటనే పూర్తి చేయాలని, రెండవ డోసుకు అర్హత వచ్చిన వారికి వాక్సినేషన్ వేయుటకు పక్కా ప్రణాళిక తో సిద్దంగా ఉండాలని, వారికి స్వయంగా ఫోన్ చేసి వాక్సిన్ వేసుకునే విధంగా చైతన్య పరచాలని అన్నారు. పట్టణంలో పెండింగ్ లో ఉన్న వాక్సినేషన్ వెంటనే పూర్తి చేయాలన్నారు. ఈ నెల 9వ తేది నుండి రెండవ డోసు ప్రారభంకానున్న నేపద్యంలో వారికి వచ్చిన తేదిలలో వాక్సిన్ తీసుకోవాలని అన్నారు. పట్టణ పరిది లో 15 వాక్సినేషన్ సెంటర్ల ను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ కె.నరసింహా, ఎస్డిసి మాలతి, ఉప వైద్యాధికారిణి డా.కరుణశ్రీ తదితరులు పాల్గొన్నారు.

Share This Post