వాగులో గల్లాంతై మృతి చెందిన వార్డు మెంబెర్ కుటుంబ సభ్యులను పరామర్శించిన విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి

గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు వాగులో గల్లంతై మృతి చెందిన వికారాబాద్ మండలం పులుసుమామిడి గ్రామ వార్డు మెంబర్ ఇషాక్ పాషా కుటుంబ సభ్యులను ఈరోజు విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి వారి ఇంటి వద్దకు వెళ్లి పరామర్శించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఇషాక్ మృతి బాధాకరమని, మృతుని కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మృతుని భార్యకు అవుట్ సోర్సింగ్ లో ఉద్యోగం కల్పించాలని మంత్రి జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. భర్తను కోల్పోయి ఇద్దరు కావల పిల్లలతో రోదిస్తున్న భార్యను చూసి మంత్రి చలించిపోయారు. స్థానిక శాసన సభ్యులుతో కలిసి అండగా ఉంటామని మృతుని తండ్రికి అభయమిచ్చారు.

జిల్లా కలెక్టర్ నిఖిల, వికారాబాద్ శాసన సభ్యులు మెతుకు ఆనంద్, బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, జడ్పీ వైస్ చైర్మన్ విజయకుమార్, జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ ఆర్డిఓ
ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share This Post