వాగులో చిక్కుకున్న కూలీలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన తర్వాత వారిని కలిసి పరామర్శించిన ఎమ్మేల్యే రెడ్యా నాయక్, జిల్లా కలెక్టర్ కె. శశాంక.

వాగులో చిక్కుకున్న కూలీలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన తర్వాత వారిని కలిసి పరామర్శించిన ఎమ్మేల్యే రెడ్యా నాయక్, జిల్లా కలెక్టర్ కె. శశాంక.

ప్రచురణార్థం

మరిపెడ,
మహబూబాబాద్ జిల్లా, జూలై -23:

వాగులో చిక్కుకున్న కూలీలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన తర్వాత వారిని డోర్నకల్ ఎమ్మేల్యే రెడ్యా నాయక్, జిల్లా కలెక్టర్ కె. శశాంక కలిసి పరామర్శించారు.

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని తానం చెర్ల శివారులోని చావ్లా తండాకు చెందిన 22 మంది కూలీలు పాలేరు వాగు సమీపంలోనీ వాగులో శుక్రవారం రాత్రి చిక్కుకోగా, వెంటనే ఎన్ డి ఆర్ ఎఫ్ రిస్క్ టీంను పంపి వారిని సురక్షితంగా ఒడ్డు కు చేర్చడం జరిగింది.

శనివారం ఉదయం ఎమ్మేల్యే, జిల్లా కలెక్టర్ రాంపురం వద్ద కూలీలను కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మేల్యే, జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, వర్షాల దృష్ట్యా ఓవర్ ఫ్లో అయ్యే దారులపై నుండి వెళ్లరాదని, జాగ్రత్తగా ఉండాలని, పశువులను బయటకు పంపరాదని, చేపలు పట్టడానికి వెళ్లకూడదని, అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, అడిషనల్ ఎస్పీ యోగేష్ గౌతం, ఆర్డీవో ఎల్.రమేష్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post