వానకాలం 2020-21 సం.నకు CMR పెండింగ్ రైస్ ను సెప్టెంబర్ 30 లోగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన. తేది:13.9.2021, వనపర్తి.

వానకాలం 2020-21 సం.నకు CMR పెండింగ్ రైస్ ను మిల్లర్లు వెంటనే మిల్లింగ్ చేయించాలని, జాప్యం చేయకూడదని సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో రెవెన్యూ, సివిల్ సప్లై, మిల్లర్ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో 2020-21 సం.నకు గాను 27 వేల మెట్రిక్ టన్నుల బియ్యం పెండింగ్లో ఉందని, వెంటనే ప్రతిరోజు మిల్లింగ్ చేసి, కస్టమ్ మిల్లింగ్ రైస్ డెలివరీ లు సెప్టెంబర్ 30 లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, జిల్లా సివిల్ సప్లై అధికారి అనిల్ కుమార్, రెవెన్యూ అధికారులు, మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.
……………
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

 

Share This Post