వానాకాలం వరి ధాన్యం కొనుగోలుకు ఇప్పటి నుండే పకడ్బందీగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి లైన్ డిపార్ట్మెంట్ అధికారులను ఆదేశించారు.

పత్రిక ప్రకటన

తేది: 7-9-202

నారాయణపేట జిల్లా

వానాకాలం వరి ధాన్యం కొనుగోలుకు ఇప్పటి నుండే పకడ్బందీగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి లైన్ డిపార్ట్మెంట్ అధికారులను ఆదేశించారు.  మంగళవారం ఉదయం కెక్టరేట్ సమావేశ హాల్లొ ధాన్యం కొనుగోలు సంసిద్ధత పై సంబంధిత జిల్లా అధికారులు, రైస్ మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత సీజన్ ధాన్యం కొనుగోలులో వచ్చిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆవు పునరావృతం కాకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు.  దాదాపుగా అక్టోబర్ మూడవ వారంలో కోతలు ప్రారంభమై ధాన్యం చేతికి వస్తుందని ఆ లోపల అన్ని ప్రణాళికలు, మౌళిక సదుపాయాలు సిద్ధం చేసుకోవాలన్నారు.  ముఖ్యంగా గోదాముల సమస్య రాకుండా ఇపుడే ఏ ఏరియాలో ఎంత కెపాసిటీ కలిగిన గోదాములు ఉన్నాయో జాబితా సిద్ధం చేసి ఇవ్వాల్సిందిగా మార్కెటింగ్ అధికారిని ఆదేశించారు.  గోదాములకు ఏమైనా మరమ్మతులు ఉంటే వాటిని గుర్తించి మరమ్మతులు చేయించాలని ఆదేశించారు.  రవాణా విషయంలో సమస్య తలెత్తకుండా ముందే కాంట్రాక్టర్ తో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.  ఐకెపి, పిఎసియస్, మెప్మా కొనుగోలు కేంద్రాల సిబ్బందికి ముందుగానే కొనుగోలు ఏ విదంగా చేయాలి, తేమ, తాలు వంటివి ఏ విధంగా ప్రామాణికం చేసుకోవాలో అందరికి శిక్షణ కార్యక్రమము నిర్వహించాల్సిందిగా సివిల్ సప్లై మేనేజర్ ను ఆదేశించారు.  ఈ సారి వ్యవసాయ మండల అధికారుల ఆధ్వర్యంలో టొకన్ల పంపిణీ, గన్ని బ్యాగుల పంపిణీ జరిగే విధంగా చూసుకోవాలని వ్యవసాయ అధికారిని ఆదేశించారు. ఈ సారి ఎంత ధాన్యం ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని వ్యవసాయ అధికారిని అడుగగా దాదాపు 2.50 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి కానుందని, స్థానిక అవసరాలు పోను 2.10 లక్షల టన్నుల ధాన్యం మార్కెట్ కు వచ్చే అవకాశం ఉందని జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు.   జిల్లాకు అవసరమైన గన్ని బ్యాగులకు ఇండెంట్ పంపించాలని తెలియజేసారు. ధాన్యం కొనుగోలు సమయానికి ఎలాంటి సమస్య రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో సివిల్ సప్లై మేనేజర్ హతిరామ్ నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్, పి.డి.డిఆర్డీఓ గోపాల్ నాయక్, మెప్మా అధికారి కృష్ణమాచారి, మార్కెటింగ్ అధికారిణి బాలమణి, జిల్లా సివిల్ సప్లై అధికారి శివకుమార్, ఆర్.టి.ఓ వీరస్వామి, రైస్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.

——————-

జిల్లా పౌర సంబంధాల అధికారి  నారాయణపేట ద్వారా జారీ

Share This Post