వానాకాలం సీజన్ పంట ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఎవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.

ప్రచురణార్ధం

డిశంబరు, 15, ఖమ్మం

వానాకాలం సీజన్ పంట ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఎవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. బుధవారం టి.టి.డి.సి సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, రవాణా, ధాన్యం నిల్వలు, గన్నీబ్యా గుల నిల్వలు, రైతుల ఖాతాల్లో నగదు జమ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికీ 247 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇప్పటి వరకు 77 వేల 808  మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని, ట్యాబ్ ఎంట్రీ అయిన 24 గంటల్లోపు రైతుల ఖాతాలకు చెల్లింపులు చేయడం జరుగుతుందన్నారు. నేటి వరకు 9721 మంది రైతుల నుండి 167 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని, 75 కోట్ల రూపాయలను 4,3906 మంది రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించే ముందు తూర్పారబట్టి, తేమశాతం చూసుకొని తీసుకొని వచ్చిన ధాన్యాన్ని కాంట వేసి మిల్లులకు తరలించేందుకు సత్వర చర్యలు చేపట్టాలన్నారు. రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యానికి సత్వరమే రైతుల ఖాతాలకు నగదు జము చేయడం జరుగుతుందన్నారు.

జిల్లా కలెక్టర్ వి.సి. గౌతమ్ మాట్లాడుతూ వానాకాలం సీజన్ ధాన్యాన్ని కొనుగోలుకు అన్ని ముందస్తు ఏర్పట్లతో సంసిద్ధం చేసామని కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని తేమశాతం ఆధారంగా కాంటా వేసి ట్యాబ్ ఎంట్రీ  చేయడం ద్వారా చెల్లింపులు వెనువెంటనే చేయడం జరుగుతుందన్నారు. ధాన్యానికి సరిపోను గన్నీ బ్యాగులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. వచ్చే యాసంగిలో వ రి కి ప్రత్యామ్నాయ పంటలను మాత్రమే సాగు చేసుకునే విధంగా రైతులను విస్తరణాధికారులు సమన్వయంతో అవగాహన కల్పించాలన్నారు.

సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు, సత్తుపల్లి, వైరా శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య, లావుడ్యా రాములు నాయక్, డి.సి.సి.బి చైర్మన్ కూరాకుల నాగభూషణం, రైతు సమస్యయ సమితి జిల్లా కో-ఆర్డినేటర్ నల్లమల వెంకటేశ్వరరావు, డి.సి.ఎం.ఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్, జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి రాజేందర్, సివిల్ సప్లయిస్ జిల్లా మేనేజర్ సోములు, జిల్లా వ్యవసాయశాఖాధికారి విజయనిర్మల, జిల్లా సహాకార శాఖాధికారి విజయకుమారి, జిల్లా రవాణా శాఖాధికారి కిషన్, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియోషన్ అధ్యక్షులు బొమ్మరాజేశ్వరరావు, తదితరులు. పాల్గొన్నారు.

Share This Post