వానాకాలం సీజన్ లో రైతులు పండించిన ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలనీ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. గురువారం నాడు కలెక్టర్ భీమదేవరపల్లీ మండలం కొత్తపల్లి, వంగర గ్రామ పరిధిలోని కొనుగోలు కేంద్రాలు పరీశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతులకు రశీదులు ఇవ్వాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల నుండి లారీల ద్వారా కేటాయించిన రైస్ మిల్లులకు పంపించిన ధాన్యాన్ని వెంటనే దించుకోవాలనీ ఆయన సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు పేమెంట్ లను ఎప్పటికప్పుడు చెల్లించాలని అన్నారు. ఇప్పటి వరకు జిల్లా లో యాభై వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించి నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలక్టర్ సంధ్యారాణి, పీడీ డీఆర్డీఏ శ్రీనివాస్ కుమార్,డియస్ ఓ వసంత లక్ష్మీ, డీసీఓ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

గురువారం నాడు కలెక్టర్ భీమదేవరపల్లీ మండలం కొత్తపల్లి, వంగర గ్రామ పరిధిలోని కొనుగోలు కేంద్రాలు పరీశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతులకు రశీదులు ఇవ్వాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల నుండి లారీల ద్వారా కేటాయించిన రైస్ మిల్లులకు పంపించిన ధాన్యాన్ని వెంటనే దించుకోవాలనీ ఆయన సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు పేమెంట్ లను ఎప్పటికప్పుడు చెల్లించాలని అన్నారు. ఇప్పటి వరకు జిల్లా లో యాభై వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించి నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కలక్టర్ సంధ్యారాణి, పీడీ డీఆర్డీఏ శ్రీనివాస్ కుమార్,డియస్ ఓ వసంత లక్ష్మీ, డీసీఓ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Share This Post