*వానాకాలం 2021-22 కొనుగోళ్ల పై కలెక్టర్ కార్యాలయం లో కంట్రోల్ రూమ్*

*వానాకాలం 2021-22 కొనుగోళ్ల పై కలెక్టర్ కార్యాలయం లో కంట్రోల్ రూమ్*         #కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్.   #కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ 9963407064               నల్గొండ;నవంబర్ 3. వానాకాలం 2021-22   దాన్యం కొనుగోళ్ల పై  సమస్యలు పరిష్కరించేందుకు జిల్లా కలెక్టరేట్ లోని జిల్లా పౌర సరఫరాల అధికారి కార్యాలయం లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ను బుధవారం అదనపు కలెక్టర్ వనమాల చంద్ర శేఖర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలు అనుసరించి రైతులు పండించిన వరి దాన్యం కు కొనుగోలు కేంద్రాల్లో ఎదురయ్యే సమస్యలు,గన్నీ ల కొరత,వరి దాన్యం రవాణా,కొనుగోలు చేసిన దాన్యం చెల్లింపు లాంటి సమస్యలు ఉంటే రైతులు గాని,కొనుగోలు కేంద్రాల ఇంచార్జి లు గాని కంట్రోల్ రూమ్ నంబర్ 9963407064 కు ఫోన్ చేసి తెలుపాలని అన్నారు.కంట్రోల్ రూమ్ ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పని చేస్తుందని,కంట్రోల్ రూమ్ లో పొరసరఫరాల శాఖ,పౌర సరఫరాల సంస్థ,డి.ఆర్.డి.ఓ.,సహకార శాఖ,మార్కెటింగ్,వ్యవసాయ శాఖ,మిల్లర్ ల నుండి ఒకరు రెండు షిఫ్ట్ లలో విధులు నిర్వహిస్తారని అన్నారు.వానాకాలం సీజన్ కు సంబంధించి ఫోన్ లో వచ్చిన సనస్యలు రిజిస్టర్ లో నోట్ చేసుకుని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళి పరిష్కారం చేస్తారని,కంట్రోల్ రూమ్ ఇంచార్జి లు ప్రతి రోజు అదనపు కలెక్టర్ కు సనస్యలు వివరిస్తారని అన్నారు.                        అనంతరం జిల్లా పౌర సరఫరాల అధికారి కార్యాలయం లో జిల్లా పౌర సరఫరాల శాఖ,మార్కెటింగ్ శాఖ లు  వరి మద్దతు ధర,నాణ్యతా ప్రమాణాలపై రూపొందించిన పోస్టర్ ను అదనపు కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం లో జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు,జిల్లా పౌర సరఫరాల సంస్థ డి.యం.నాగేశ్వర్ రావు,జిల్లా మార్కెటింగ్ అధికారి శ్రీకాంత్, డి.పి.ఆర్.ఓ.శ్రీనివాస్,డి.ఆర్.డి.ఓ.డి.పి.యం.అరుణ్,సహాయ పౌర సరఫరాల అధికారి నిత్యానందం,నల్గొండ  మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు యాదగిరి,మిల్లర్లు, తదితరులు పాల్గొన్నారు

Share This Post