రైతుకు ఎలాంటి సమస్యలు లేకుండా వానా కాలం 2021-22 సీజన్ కు వరి దాన్యం సేకరణకు కార్యాచరణ ప్రణాళికతో పకడ్బందీ గా ముందస్తు ఏర్పాట్ల తో సంసిద్ధం కావాలని అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ అధికారులను ఆదేశించారు. వానాకాలం 2021-22 వరి ధాన్యం సేకరణపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తన ఛాంబర్ లో అదనపు కలెక్టర్ కోర్ కమిటీ తో పూర్వ సమీక్షా సమావేశం నిర్వహించి సమీక్ష చేశారు.ఈ సమావేశం లో పౌర సరఫరాల శాఖ,సహకార శాఖ,మార్కెటింగ్,రవాణ, గ్రామీణాభివృద్ధి,తూనికలు కొలతలు,కార్మిక శాఖ,మిల్లర్ లు,వ్యవసాయ శాఖ అధికారులతో వానాకాలం వరి దాన్యం కొనుగోళ్ల పై చర్చించారు. ఈ
సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రైతులు కల్లా ల వద్ద దాన్యం ఆరబెట్టి నిర్ణీత 17 తేమ శాతం మించకుండా,నాణ్యతా ప్రమాణాల తో దాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకుని వచ్చేలా వ్యవసాయ శాఖ అవగాహన కలిగించాలని,ఇందుకు అవసరమైన సహకారం జిల్లా యంత్రాంగం అందిస్తుందని ఆయన అన్నారు.
గత సీజన్ లో కోవిడ్ ఉన్నా రైతు దగ్గర ధాన్యం కొనుగోలు చేశాము. అయితే కోవిడ్ వల్ల రవాణాలో, ఇతర విషయాల్లో రైతులకు కొంత ఇబ్బంది జరిగింది.గత సీజన్ లో ఎదురుకొన్న సమస్యలు దృష్టి లో ఉంచుకొని వానాకాలం సీజన్ లో అన్ని శాఖలు తమ తమ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తూ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు ననుసరించి కొనుగోలు కేంద్రాలు,మౌలిక వసతులు,కొనుగోలు నుండి చెల్లింపు వరకు సమన్వయం తో పని చేయాలని అన్నారు.ముఖ్యంగా కొనుగోలు కేంద్రాలు,వ్యవసాయ శాఖ, మిల్లర్ లు కొనుగోలు కేంద్రం నుండి కొనుగోలు చేసిన వెంటనే మిల్లు వరకు దాన్యం రవాణా కు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రణాళిక బద్దంగా ముందుకు పోవాలని అన్నారు.వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం 5 లక్షల 43 వేల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం దాన్యం కొనుగోలు చేయవలిసి ఉంటుందని అన్నారు.మిల్లుల కెపాసిటీ 5 లక్షల 81 వేల మెట్రిక్ టన్నులు కాగా ఇప్పటికే 4 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల దాన్యం మిల్లుల వద్ద ఉన్నట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి వివరించారు.కొనుగోలు కేంద్రాలను సహకార,మార్కెటింగ్, గ్రామీణాభివృద్ధి శాఖ మూడు రోజుల్లో ఖరారు చేసి ప్రతిపాదనలు పంపాలని సంబంధిత శాఖల అధికారులను ఆయన ఆదేశించారు.కొనుగోలు కేంద్రాల ఏర్పాటు లో ప్రభుత్వం మార్గదర్శకాలు పాటించి లోతట్టు ప్రాంతం లో ఏర్పాటు చేయ వద్దని,వర్షం నీరు చేరుతుందని అన్నారు.ఎగువ ప్రాంతం లో ఏర్పాటు చేయాలని అన్నారు.కొను గోలు కేంద్రాల ఇంచార్జి లు బాధ్యత గా పని చేయాలని,అప్పుడు సమస్యలు ఉత్పన్నం కావని,నాణ్యతా ప్రమాణాలు ఉన్న దాన్యం కొనుగోలు చేయాలని,వ్యవసాయ శాఖ అధికారులు తేమ శాతం నిర్దారించాలని అన్నారు.
రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని అన్ లోడింగ్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకోకుండా ప్రణాళిక రూపొందించుకుని వసతులు కల్పించాలి. అదేవిధంగా తెచ్చిన ధాన్యం స్టోర్ చేయడానికి సరైన స్థలం ఉండేలా చూడాలి
రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని ఇక్కడ ఆరపోయకుండా సరైన సమాచారం తీసుకుని, రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించాలి
రైతులు తాలు తీసుకురాకుండా, తేమ శాతం ఎక్కువ ఉన్న పంటను తీసుకురాకుండా వారికి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలి
ప్రతి 5000 ఎకరాలకు ఒక అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ అధికారి ఉన్నందున ఏ రైతుకు ఏ పంట పండుతుంది, ఎంతవరకు పండుతుందని అవగాహన ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని టోకెన్లు ఇవ్వాలి. ఒకేసారి అందరికీ టోకెన్లు ఇచ్చి మార్కెట్ వద్దకు వచ్చేలా ఉండకూడదని అదనపు కలెక్టర్ సూచించారు.ముఖ్యంగా మార్కెట్ యార్డ్ లలో నకిరేకల్,కొండ మల్లేపల్లి లాంటి చోట్ల ఇబ్బందులు వచ్చాయని,అటు వంటి ఇబ్బందులు ఎదురు కాకుండా అధికారులు ప్రణాళిక బద్దంగా కార్యచరణ రూపొందించు కోవాలని అన్నారు.కొనుగోలు కేంద్రాలలో టార్పాలిన్ లు,తూకం,తేమ యంత్రాలు,హమాలీ సమస్యలు,రవాణా,ట్యాబ్ ఎంట్రీ సమస్యలు లేకుండా చూడాలని అన్నారు.కొనుగోళ్ల సంబంధించి కొనుగోలు కేంద్రాల ఇంఛార్జీలకు దాన్యం నాణ్యత,మేనేజ్మెంట్ పై శిక్షణా కార్యక్రమం లు నిర్వహించాలని అన్నారు.ఈ సమావేశం లో జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు,పౌర సరఫరాల సంస్థ డి.యం.నాగేశ్వర్ రావు,జిల్లా సహకార అధికారి ప్రసాద్,జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ రెడ్డి,తూనికలు కొలతలు శాఖ అధికారి రామ కృష్ణ, కార్మిక శాఖ డి.సి.రాజేంద్ర ప్రసాద్,రవాణా శాఖ అధికారి సురేష్ రెడ్డి, సహాయ పౌర సరఫరాల అధికారి నిత్యా నందం,డి.ఆర్.డి.ఓ.డి.పి.యం.అరుణ్,మిల్లర్ లు పాల్గొన్నారు


