వారం రోజుల్లోగా వృద్ధుల డే కేర్ సెంటర్ ను సిద్ధం చేయాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
———————————————
మలి సంధ్యలో ఒంటరితనాన్ని దూరం చేసేందుకు ఏర్పాటు చేస్తున్న డే కేర్ సెంటర్ ను రాబోయే వారం రోజుల్లోగా సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.
గురువారం ఆయన ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఎస్టీ వసతి గృహ భవనంలో ఏర్పాటు చేయనున్న వయో వృద్ధుల డే కేర్ సెంటర్ను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
సుమారు వంద మంది వృద్ధులు ఆశ్రమం పొందేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నామని, తాత్కాలికంగా 15 పడకలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దూర ప్రాంతాల్లో పిల్లలు ఉన్న వృద్ధులు ఒంటరితనంతో మానసికంగా కుంగిపోకుండా ఉండాలనే లక్ష్యంతో మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో మండల కేంద్రంలో ఈ డే కేర్ సెంటర్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. కేంద్రంలో ఆహ్లాదకర వాతావరణంతో పాటు అన్ని హంగులు, వసతులు సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఆట వస్తువులు, అవగాహన, ఆరోగ్య పరీక్షలు నిర్వహించేలా పర్యవేక్షణ చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ పరిశీలనలో పంచాయితీ రాజ్ ఈఈ సూర్య ప్రకాశ్, తదితరులు ఉన్నారు.
——————————————————-