వారం రోజుల్లోగా హరితహారం లక్ష్యం పూర్తిచేయాలి జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

వారం రోజుల్లోగా హరితహారం లక్ష్యం  పూర్తిచేయాలి

జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

000000

     హారితహారం కార్యక్రమంలో బాగంగా నిర్దేశించిన లక్ష్యాలను వారం రోజుల్లోగా  పూర్తిచేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్  ఆదేశించారు.

     బుదవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో తెలంగాణకు హరితహారం, తెలంగాణ  క్రీడా ప్రాంగణాలపై ఎంపీడీవోలు,  జిల్లా అధికారులతో శాఖల వారిగా అయన సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ హరితహారం లో నిర్దేశించిన లక్ష్యం ను వారం రోజులగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలం పూర్తయ్యేలోగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తిచేసి జియోట్యాగింగ్ పూర్తిచేయాలని ఆదేశించారు.  అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటాని హెచ్చరించారు. లక్ష్యంమేర పూర్తిచేయాలని అన్నారు. తెలంగాణ గ్రామీణ క్రీడాప్రాంగణాల స్థలాల గ్రౌండింగ్ పూర్తి కావాలని అన్నారు. అగస్టు 15 లోగా జిల్లాలో ఎటుంవంటి పెండింగ్ పనులు ఉండకూడదని అధికారులను ఆదేశించారు.

     ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్యాంప్రసాద్ లాల్, గరిమా అగర్వాల్, అడిషనల్ సిపి లా ఆండ్ ఆర్డర్ శ్రీనివాస్, జిల్లాస్థాయి అధికారుల, యంపిడిఓలు, తదితరులు పాల్గోన్నారు.

Share This Post