వారం లోగా ప్రంట్ లైన్ వర్కర్లలకు, 60 సంవత్సరాల పైబడిన వారికి కోవిడ్ వ్యాక్సిన్ అందించాలి జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

వారం లోగా  ప్రంట్ లైన్ వర్కర్లలకు, 60 సంవత్సరాల పైబడిన వారికి కోవిడ్ వ్యాక్సిన్ అందించాలి

జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

0 0 0 0

     ప్రంట్ లైన్ వర్కర్లు,60 సంవత్సరాల పైబడిన వారికి కోవిడ్ వ్యాక్సినేషన్ ను వారం రోజుల లోగా అని  జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు.

        శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో  కోవిడ్ వ్యాక్సినేషన్,  సాధారణ ప్రసవాలపై ప్రభుత్వ, ప్రైవేటు గైనకాలజిస్టులు, అంగన్ వాడి సూపర్ వైజర్లు, ప్రభుత్వ ప్రైవేటు డాక్టర్లు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమీక్షించారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ  జిల్లా వ్యాప్తoగా  ప్రంట్ లైన్ వర్కర్లు, 60 సంవత్సరాల పైబడిన వారికి  కోవిడ్ వ్యాక్సినేషన్ ను అందించేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని,  గ్రామస్థాయిలో అంగన్ వాడి టీచర్లు, ఆశా కార్యకర్తలు, ఎఎన్ ఎం లు సమన్వయంతో పనిచేయాలని,  ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలు జరుగుటకు కృషిచేయాలని ఆయన సూచించారు.  ప్రతి సోమవారం మరియు శుక్రవారం  ప్రతి ఆరోగ్య కేంద్రాలలో  పోషకాహారాలతో కూడిన  భోజనాన్ని  గర్బీణిలకు అందించాలన్నారు.   ప్రైవేటు ఆసుపత్రులలో ఆపరేషన్ ద్వారా కాకుండా , సాధారణ ప్రసవాలకు ఎక్కువ ప్రాదాన్యతను ఇవ్వాలని అన్నారు.   సాధారణ ప్రసేవాలు, పౌష్టికాహారం గురించి గర్బీణి స్త్రీలకు వారి తల్లితండ్రులకు వివరించాలని అన్నారు.   కోవిడ్ కేసులు పెరుగుతున్నందున దృశ్యా ప్రికాషన్ డోస్ ను వారంలోగా అందజేయాలని అన్నారు. హర్గర్, దస్థక్  దీనిలో బాగంగా ఇంటింటికి వెళ్లి వ్యాక్సినేషన్ వివరాలు సేకరించేలా సిబ్బంది వివరాలను సిద్దం చేయాలని అన్నారు.

     

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్,  జిల్లా వైద్యాధికారి జవేరియా, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి పద్మావతి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి, వైద్యాధికారులు, అంగన్ వాడి సూపర్ వైజర్లు, ప్రభుత్వ, ప్రైవేటు గైనకాలజిస్టులు,  తదితరులు పాల్గోన్నారు.

Share This Post