వారం వారం పక్కా ప్రణాళికతో కలెక్టరేట్, నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్

వారం వారం పక్కా ప్రణాళికతో కలెక్టరేట్, నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్

నూతన కలెక్టరేట్, నర్సింగ్ కళాశాల నూతన భవనాలు చేపడుతున్న నిర్మాణ పనులు వారం వారం  ప్రణాళికలతో అనుకున్న సమయానికి నిర్మాణ పనులు సకాలంలో పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని నాగర్ కర్నూలు జిలా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు.

గురువారం నాగర్ కర్నూల్ పట్టణ పరిధిలో ఉయ్యాలవాడ వద్ద చేపడుతున్న నూతన నర్సింగ్ కళాశాల భవనం మరియు మహేంద్రనాథ్ చౌరస్తా సమీపంలో చేపడుతున్న నూతన కలెక్టరేట్, కలెక్టర్, అదనపు కలెక్టర్ల గృహ సముదాయ భవనాల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.

వారం వారం నిర్మాణాలకు కావలసిన ప్రణాళికలతో నిర్దేశించిన గడువులోగా నిర్మాణాలు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని  ఆర్.అండ్.బి అధికారులను ఆదేశించారు.

నర్సింగ్ కళాశాల, కలెక్టరేట్ భవనాల నిర్మాణాలకు ప్రస్తుతం చేపడుతున్న నిర్మాణ పనులకు, అవసరమైన ఇసక తదితర పనుల పురోగతిపై కాంట్రాక్టర్ లను అడిగి తెలుసుకున్నారు.

ప్రతిరోజు చేపడుతున్న నిర్మాణాల పనులకు అవసరమైనంత ఎక్కువమంది కూలీలను వినియోగించుకోవాలని ప్రతిరోజూ ఏ స్థాయిలో పనులు చేపట్టాలో నిర్ధారించుకున్న పనులను ఆ రోజే పూర్తి అయ్యేలా కార్యాచరణతో పనులు చేపట్టాలని కలెక్టర్ కాంట్రాక్టర్లకు సూచించారు.

రెడ్ క్రాస్ మరియు జిల్లా స్థాయి అధికారుల గృహ సముదాయాలకు అవసరమైన భూసేకరణను కలెక్టర్  పరిశీలించారు.

వారంలో రెండు సార్లు కలెక్టరేట్ నర్సింగ్ కళాశాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేపడుతున్న నిర్మాణాల పనులను తానే స్వయంగా పరిశీలిస్తానని వారికి సూచించారు.

వారం వారం పురోగతి పనుల్లో తేడాలు లేకుండా నాణ్యతతో వేగవంతం చేయాలని కలెక్టర్ కాంట్రాక్టర్లను అధికారులను ఆదేశించారు.

అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఆర్.అండ్ బి ఈ.ఈ భాస్కర్ , డిఇ రమాదేవి, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, నాగర్ కర్నూల్ ఇన్చార్జి తహసిల్దార్ ఖాజా, ఏఈ మహేష్, సర్వేయర్ రఘు, కాంట్రాక్టర్లు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.

Share This Post