*వార్డు సభలను నిర్వహించి రెండు పడక గదుల ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేయాలి : ఇంఛార్జి రెవెన్యూ అధికారి టి.శ్రీనివాస రావు*

*వార్డు సభలను నిర్వహించి రెండు పడక గదుల ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేయాలి : ఇంఛార్జి రెవెన్యూ అధికారి టి.శ్రీనివాస రావు*

సిరిసిల్ల, నవంబర్ 2: సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 39 వార్డుల్లో సంబంధిత వార్డు అధికారులు, ఆయా వార్డులకు కేటాయించిన ప్రత్యేకాధికారులు వార్డు సభలను నిర్వహించి రెండు పడక గదుల లబ్ధిదారులను ఎంపిక చేయాలని జిల్లా ఇంఛార్జి రెవెన్యూ అధికారి టి. శ్రీనివాస రావు ఆదేశించారు. మంగళవారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్ లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. గతంలో పట్టణంలో సర్వే చేసిన వార్డు అధికారులు ప్రస్తుతం కేటాయించిన ప్రత్యేకాధికారులతో సమన్వయం చేసుకుని తుది జాబితాలను సిద్ధం చేయాలని సూచించారు. అనంతరం ఆ జాబితాల ఆధారంగా ఆయా వార్డుల్లో వార్డు సభలను నిర్వహించి రెండు పడక గదుల ఇండ్లు పొందడానికి అర్హులైన వారిని గుర్తించాలని అన్నారు. ఈ ప్రక్రియ క్షేత్ర స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, సజావుగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు.
ఈ సమీక్షలో జెడ్పీ సీఈవో గౌతం రెడ్డి, మున్సిపల్ కమీషనర్ సమ్మయ్య, డీఆర్డీఓ కె.కౌటిల్య, డీపీఓ రవీందర్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, ప్రత్యేకాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post