వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యం మేరకు రుణాలు మంజూరు చేయాలి: జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్

వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యం మేరకు రుణాలు మంజూరు చేయాలి:

జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్

0000

2021-22 ఆర్థిక సంవత్సరం వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యం మేరకు రుణాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు.

మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో బ్యాంకర్లతో జరిగిన డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ/డి.ఎల్.ఆర్.సి. సమావేశానికి ఆయన హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2021-22 వార్షిక రుణ ప్రణాళిక ప్రకారము కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను గ్రౌండింగ్ చేయుటకు రుణాలు మంజూరు చేయాలని అన్నారు. 2021-22 వార్షిక రుణ ప్రణాళిక ప్రకారము 4,040.5 కోట్ల రుణాలు లక్ష్యం కాగా, సెప్టెంబర్ 30 వరకు 2,765 కోట్ల రుణాలు మంజూరు చేశామని తెలిపారు. ఇందులో షార్ట్ టర్మ్ పంట ఉత్పత్తులకు సంబంధించి 1,860.5 కోట్లు లక్ష్యం కాగా 825 కోట్లు మంజూరు చేశారని, 2,921.5 కోట్ల వ్యవసాయ రుణాలు మంజూరు లక్ష్యం కాగా, 1,169 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. మిగిలిన ఇతర రుణాలను వెంటనే లక్ష్యం మేరకు మంజూరు చేయాలని అన్నారు. జిల్లాలో అర్హులైన రైతులందరికి రబీ సీజన్ కు లక్ష్యం మేరకు పంట రుణాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు. జిల్లాలో అన్ని మండలాల్లో మండల అభివృద్ధి అధికారులు బ్యాంకర్లతో నెల వారిగా సమావేశాలు నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల రుణాలను మంజూరు అయ్యేల చూడాలని అన్నారు. ముఖ్యంగా వ్యవసాయ పంట రుణాలను లక్ష్యం మేరకు మంజూరు చేయాలని, అలాగే ముద్ర లోన్స్ మంజూరు చేయాలని సూచించారు.

నాబార్డ్ ద్వారా 4,423 కోట్ల పొటెన్సిషల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరణ : నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవల్మెంట్ (నాబార్డ్) ద్వారా 2022-23 సంవత్సరానికి కరీంనగర్ జిల్లాకు 4,423 కోట్లతో తయారు చేసిన పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ ను కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల సమగ్ర అభివృద్ధికి నాబార్డ్ పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ ఎంతో దోహదపడుతుందని గ్రామీణ వ్యవసాయం అనుబంధ రంగాల పై ఆసక్తి నెలకొల్పడంలో రుణాల మంజూరులో బ్యాంకర్లు క్రీయశీలక పాత్ర పోషించాలని సూచించారు. వ్యవసాయ మౌళిక సదుపాయాలు అనుబంధ కార్యక్రమాలతో సహా వ్యవసాయం కోసం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ రంగానికి రుణాలు మంజూరు చేయాలని అన్నారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ గరీమ అగర్వాల్, ఎల్.డి.ఎం. కె.లక్ష్మణ్, నాబార్డ్ ఏజియం పి.అనంత్, ఆర్ బి ఐ ఎ జి ఎం రెహమాన్, డి.ఆర్.డి.వో. శ్రీలత, ఎస్.బి.ఐ. చీఫ్ మేనేజర్ శ్రీనివాస రావు, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఎస్.ఎం.బి. రామారావు, కెడిసిసి బ్యాంక్ సిఈవో ఎన్. సత్యనారాయణ రావు, జిల్లా పరిషత్ సి.ఈ.వో. ప్రియాంక్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్, కరీంనగర్, హుజురాబాద్ ఆర్.డి.వో.లు ఆనంద్ కుమార్, రవీందర్ రెడ్డి, బ్యాంకర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post